పవర్ స్టార్ ఫాన్స్ కు గుడ్ న్యూస్ ..

వకీల్ సాబ్ కోసం పవన్ కళ్యాణ్ అభిమానులు వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. పవన్ వెండితెరపై కనిపించి దాదాపు మూడేళ్లు అవుతుండగా, ఫ్యాన్స్ వీలైనంత త్వరగా వకీల్ సాబ్ విడుదల కావాలని కోరుకుంటున్నారు. అయితే పవన్ కళ్యాణ్ ఫాన్స్ కు ఒక గుడ్ న్యూస్ .. కరోనా కారణంగా చివరి దశలో ఆగిపోయిన  వకీల్ సాబ్ షూటింగ్ తిరిగి ప్రారంభం అయినట్లు తెలుస్తుంది.

20రోజుల షూటింగ్ మాత్రమే మిగిలి ఉండగా.. వకీల్ సాబ్ చిత్రానికి సంబందించిన కీలక సన్నివేశాల చిత్రీకరణ మొదలుపెట్టారట. పవన్ కళ్యాణ్ మాత్రం షూట్ లో పాల్గొనడం లేదని సమాచారం. పవన్ ప్రస్తుతం చాతుర్మాస్య దీక్షలో ఉన్నారు. దీక్ష ముగియడానికి మరికొంత సమయం ఉంది. దీక్షలో ఉన్న పవన్ జుట్టు, గడ్డం పెంచేశారు. దీనితో వకీల్ సాబ్ లుక్ కోసం ఆయన మేకోవర్ కావల్సి వుంది. కావున వకీల్ సాబ్ షూటింగ్ లో పవన్ తరువాత పాల్గొననున్నాడని సమాచారం. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుండగా, అంజలి, నివేదా కీలక పాత్రలలో నటిస్తున్నారు. దిల్ రాజు నిర్మాతగా ఉన్న ఈ చిత్రానికి సంగీతం థమన్ అందిస్తున్నారు.