ఆచంట జనసేన ఆధ్వర్యంలో జ్యోతిరావు పూలె కు నివాళులు

ఆచంట నియోజకవర్గం, వల్లూరు గ్రామంలో బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి జ్యోతిరావు పూలె జయంతి సందర్బంగా జనసేనపార్టీ ఆధ్వర్యంలో పూల మాలలు వేసి నివాళ్ళర్పించి, వైసీపీ ప్రభుత్వం బడుగు, బలహీన వర్గాలకు చేస్తున్న అన్యాయం పై ఒంటి కాళ్లపై నిలబడి నిరసన తెలియచేసారు. ఈ కార్యక్రమంలో జనసేనపార్టీ జిల్లా సెక్రెటరీ చిట్టూరి శ్రీనివాస్ మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక బడుగు బలహీన వర్గాలు ఐనటువంటి ఎస్సి, ఎస్టి, బిసి ల నిరుద్యోగ యువతకు అందాల్సిన సబ్సిడీ లోన్స్ విడుదల చేయకుండా జాప్యం చేస్తూ కాలయాపన చేస్తూ యువత కు అన్యాయం చేస్తుందని, గత టీడీపీ ప్రభుత్వం నాలుగేళ్లు పాటు సబ్సిడీ లోన్స్ ఇవ్వకుండా మోసం చేస్తే, వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక బడుగు, బలహీన వర్గాలకు అందాల్సిన నిధులను వైసీపీ పార్టీ కార్యకర్తలును కార్పొరేషన్ చైర్మన్ లను, డైరెక్టర్లను చేసి వారికీ జీతాల రూపంలో దోచిపెడుతున్నారని, కార్పొరేషన్ ఏర్పాటు చేయడం వల్ల పేదలకు వరిగింది ఏమిలేదని, కేవలం కార్పొరేషన్ ఏర్పాటు చేసి వైసీపీ కార్యకర్తలుకు పదవులిస్తే సరిపోదని కార్పొరేషన్కు నిధులు విడుదల చెయ్యాలని, కానీ వైసీపీ ప్రభుత్వం కార్పొరేషన్ నిధులు విడుదల చేయకుండా జాప్యం చేస్తూ యువతకు అన్యాయం చేస్తేస్తున్నారని, ఇకనైనా ప్రభుత్వం కల్లు తెరిచి బడుగు, బలహీన వర్గాల యువతకు అందాల్సిన సబ్సిడీ లోన్స్ వెంటనే విడుదల చెయ్యాలి అని డిమాండ్ చేసారు. జనసేనపార్టీ జిల్లా జాయింట్ సెక్రెటరీ రావి హరీష్ గారు మాట్లాడుతు వైసీపీ ప్రభుత్వం బడుగు, బలహీన వర్గాలకు అందాల్సిన సబ్సిడీ లోన్స్ విడుదల చేయకుండా యువతకు అన్యాయం చేస్తున్నారని, ప్రతీ సంవత్సరం జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తానని చెప్పి మోసం చేసారని, కనీసం సబ్సిడీ లోన్స్ వస్తే నిరుద్యోగ యువతకు ఉపాధి ఏర్పడుతుందని, కనీసం ఇప్పుడైనా సబ్సిడీ లోన్స్ విడుదల చేసి బడుగు, బలహీన వర్గాల యువతకు న్యాయం చెయ్యాలి అని డిమాండ్ చేసారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయుకులు యేడిద బాలు, కడిమి ఉమామహేశ్వరరావు, మొదలగువారు పాల్గొన్నారు.