మహాత్మా జ్యోతిరావు ఫూలే కు నివాళులర్పించిన తాడేపల్లిగూడెం జనసేన

తాడేపల్లిగూడెం, కుల వ్యవస్థని కూకటివేళ్లతో పెకళించాలనే ఉద్యమానికి ఆద్యుడు, సామాజిక విప్లవకారుడు మహాత్మా జ్యోతిరావు ఫూలే. దేశంలో మొదటిసారిగా దళితులకు, బాలికలకు, స్త్రీలకు పాఠశాలలు ప్రారంభించిన ఆశాజ్యోతి. విద్యతోనే జ్ఞానం అభివృద్ధి సాధ్యమని నమ్మి ఆచరణలో పెట్టిన మహనీయులు, దురాచారాలకు వ్యతిరేకంగానూ, వివిధ వర్గాల సమస్యల పరిష్కారం కోసం ఆయన చేసిన ఉద్యమాలు నేటి తరాలకు ఆదర్శం. ఆ మహనీయుని జయంతి సందర్భంగా ఘన నివాళులర్పిస్తున్న జనసేన పార్టీ తాడేపల్లిగూడెం నియోజకవర్గ ఇన్చార్జి బొలిశెట్టి శ్రీనివాస్ మరియు ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు మరియు జనసైనికులు పాల్గొన్నారు.