ఉంగుటూరు జనసేన ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి

ఉంగుటూరు, సంఘసంస్కర్త జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా ఉంగుటూరు గ్రామంలో రైల్వే గేటు దగ్గర సింగరాజు పాలెం రోడ్ లో రోడ్డు పక్కన గల అనాధశరణాలయాన్ని సందర్శించి అనాధ పిల్లలకు లక్ష్మీ నారాయణ ఫౌండేషన్ చైర్మన్, జనసేన ముఖ్య నాయకులు.. పత్సమట్ల ధర్మరాజు జనసేన పార్టీ కార్యకర్తలు, నాయకులు కలిసి పండ్లు, బిస్కెట్ లు పంపిణీ చేసి భవిష్యత్తులో శరణాలయానికి ఎటువంటి సహాయ సహకారాలు కావలసిన అందిస్తామని పౌండేషన్ తరుపున, జనసేన పార్టీ తరుపున హామీ ఇవ్వడం జరిగింది.