పెంచిన విద్యుత్ చార్జీలకు నిరసన

శ్రీకాకుళం, రాష్ట్ర ప్రభుత్వం కనీవినీ ఎరుగని రీతిలో పెంచిన విద్యుత్ చార్జీలకు నిరసనగా సోమవారం శ్రీకాకుళం జిల్లాలో శ్రీకాకుళం నియోజకవర్గ ఇంచార్జ్ కోరాడ సర్వేశ్వరరావు, ఎచ్చెర్ల నియోజకవర్గ నాయకులు శ్రీమతి కాంతి శ్రీ అధ్యక్షతన కాగడాలతో, ఫోన్ లైట్స్ తో పాత బస్టాండ్ కూడలి నుంచి ఏడు రోడ్ల కూడలి వరకు చేపట్టాల్సిన ర్యాలీని మార్గమధ్యంలోనే పోలీసు వారు దౌర్జన్యంగా ఆపి అరెస్టు చేయడం జరిగింది. కాంతి శ్రీ మాట్లాడుతూ ప్రజా పోరాటాన్ని అరెస్టులతో ఆపలేరని ఈ ఉద్యమాన్ని ప్రభుత్వం దిగి వచ్చే వరకు కొనసాగిస్తామని సంకల్ప యాత్ర సమయంలో ప్రతి ఇంటికి 200 యూనిట్లు ఫ్రీ కరెంట్ ఇస్తానని మాటిచ్చాను పెద్దమనిషి ప్రస్తుతం ఒక్క యూనిట్ కూడా ఫ్రీగా ఇవ్వలేని పరిస్థితుల్లో ఉన్నాడని ఒకపక్క పెరిగిన విద్యుత్ చార్జీలతో మరోపక్క కరెంట్ కోతలతో యావత్ రాష్ట్ర ప్రజానీకం అంధకారంలో బతికే స్థితికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకు వచ్చిందని పెంచిన విద్యుత్ చార్జీలు సవరించి వరకు జనసేన తరపు నుంచి పోరాటం ఆగదని తెలియజేశారు. ఈ నిరసన ర్యాలీలో అరెస్ట్ అయిన వారి వివరాలు పాతపట్నం నియోజకవర్గ ఇన్చార్జ్ గేదెల చైతన్య, ఆమదాలవలస నియోజకవర్గం ఇంచార్జ్ రామ్మోహన్, రాష్ట్ర కార్యక్రమాల నిర్వహణ జాయింట్ కోఆర్డినేటర్ డా విశ్వక్షేణ్, శ్రీకాకుళం టౌన్ నాయకులు ఉదయ్, శ్రీకాకుళం రూరల్ జడ్పిటిసి అభ్యర్థి కూర్మారావు, పాత కుంకం సిగ్మాన్డ్ ఎంపిటిసి అభ్యర్థి దుర్గారావు, శ్రీకాకుళం జిల్లా భగత్ సింగ్ స్టూడెంట్ యూనియన్ లీడర్ కాకర్ల బాబాజీ, గొర్ల సూర్య.
ఈ కార్యక్రమంలో టెక్కలి నాయకులు కురాకుల యాదవ్, రాజాం నాయకులు ఎన్ని రాజు, ప్రవీణ్, అవినేష్, కామేష్ అలాగే కార్యకర్తలు, జనసైనికులు పాల్గొన్నారు.