జనసేన ఆధ్వర్యంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 131 వ జయంతి

కోనసీమ జిల్లా, డాక్టర్ బాబా సాహెబ్ అంబేడ్కర్ 131వ జయంతి జనసేన ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. పవన్ కళ్యాణ్ సేవాట్రస్ట్ అధ్యక్షులు మోటూరి వెంకటేశ్వరావు, చిందాడగరువు ఎంపిటిసి మోటూరి కనకదుర్గ నక్క వారిపేట, జంగా వారి పేట, బొంతు వారి పేట, బూల వారి పేటలలో ఉన్న అంబేద్కర్ విగ్రహాల వద్ద చిందాడగరువు జనసేన పార్టీ కేక్ కట్ చేసి, పూలదండలు వేసి ఘనంగా నివాళులర్పించారు. బూలా వారి హరిజన పేటలో ఎంపిటిసి మోటూరి కనకదుర్గ – వెంకటేశ్వరావు దంపతులకు విందు కార్యక్రమం ఏర్పాటు చేశారు. దళిత సోదరులతో భోజనం చేశారు. ఈ కార్యక్రమంలో దళిత సోదరులు, దళిత పెద్దలు, దళిత మహిళలు మరియు దళిత యువకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.