కొత్తపేట జనసేన ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి వేడుకలు

బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి భారత దేశ రాజ్యాంగ సృష్టికర్త భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 131 వ జయంతి సందర్భంగా.. కొత్తపేట జనసేన పార్టీ ఇన్చార్జి బండారు శ్రీనివాస్.. కొత్తపేట నియోజకవర్గం తరఫున, జనసేన పార్టీ తరఫున, జనసేన కుటుంబ సభ్యుల తరుపున అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అంబేద్కర్ అనే వ్యక్తి 1891లో మహారాష్ట్రలో జన్మించి అతి చిన్న వయసులోనే కష్టాలు వివక్షతలు ఎదుర్కొని ఎన్ని కష్టాలు వచ్చినా.. కూడా చదువు విషయంలో వెనకడుగు అనేది వేయకుండా.. భారత రత్న అనే బిరుదు కూడా ఆయన సంపాదించుకున్నారు. కులం అనే పునాదుల మీద నీతిని జాతిని నిర్మించలేము అని ఒకవేళ నిర్మించినా కూడా.. అది పగిలి ముక్కలై పోతుంది అని చెప్పారు. అంతేగాక అంబేద్కర్ అనే వ్యక్తి గొప్ప రాజనీతిజ్ఞుడు, ఆర్థిక న్యాయ సామాజిక వేత్త గా ఎదిగి స్వేచ్ఛ, సమానత్వం, సోదర భావాలను మనకు రాజ్యాంగం ద్వారా అందించి, రాజ్యాంగ సృష్టి కర్త కూడా అయ్యాడు. అట్టడుగు వర్గాల అభ్యున్నతికి నియమాలను రూపొందించి, దేశ సమగ్రతకు వర్గ విభేదాలు లేకుండా అన్ని వర్గాల వారు కలిసి భారతీయులుగా కృషిచేయాలని కోరిన దేశభక్తుడు అంబేద్కర్. ఈ రోజున ఆయన అడుగుజాడలలో ఆయన చూపిన మార్గంలో నడవడమే ఆయనకు మనం ఇచ్చే ఘనమైన నివాళులు అని ఈ కార్యక్రమంలో పేర్కొన్నారు. కోనసీమ జిల్లాకు అంబేద్కర్ కోనసీమ జిల్లాగా చేయడానికి కొత్తపేట నియోజకవర్గం తరఫున. కొత్తపేట తరఫున, జనసేన పార్టీ తరఫున మేము మద్దతు ఇస్తున్నాము అని కూడా ఆయన చెప్పారు.