జున్నూరు జనసేన ఆధ్వర్యంలో అంబేడ్కర్ జయంతి వేడుకలు

పాలకొల్లు నియోజకవర్గం, జున్నూరు గ్రామంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 131వ జయంతి సందర్భంగా జున్నూరు జనసైనికులు, వీర మహిళలు ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా.. ఇటీవల అనంతపురం జిల్లాలో జనసేన పార్టీ చేపట్టిన కౌలు రైతు భరోసా యాత్రలో భాగంగా ఆత్మహత్య చేసుకుని చనిపోయిన కౌలు రైతుల కుటుంబాలకు లక్ష రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారికి జున్నూరు జనసైనికులు కృతజ్ఞతలు తెలియజేశారు.