కందరడా గ్రామంలో అంబేద్కర్ జయంతి వేడుకలు

పిఠాపురం నియోజకవర్గ పరిధిలోని పిఠాపురం మండల కందరడా గ్రామంలో అంబేద్కర్ కాలనీ యందు ఉన్నటువంటి డా.బిఆర్ అంబేద్కర్ మరియు ఎస్టి బుడగ జంగం సంఘము ఏర్పాటు చేసిన డా. బి ఆర్ అంబేద్కర్ విగ్రహానికి రెండు చోట్లా పూలమాలలు వేసి 131వ జయంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కందరడా ఎంపీటీసీ పిల్లా సునీతా, సూర్యనారాయణ, పెద్ద పుత్రయ్య, కన్నబత్తుల జీవరత్నం, పల్లెటి వినోద్, మోటూరి మహేష్, కన్నబత్తుల కృష్ణంరాజు, రమణ, వకాపల్లి సూర్యప్రకాష్, చిన్న పుత్రయ్య, పల్లేటి శ్రీను, కన్నబత్తుల కృష్ణంరాజు, మల్లవరపు వెంకటరమణ, మాస సూరిబాబు, పెద్దోడు, సలాది కృష్ణ, దుర్గాడ శివశంకర్, పిల్లా రామ్ కుమార్, మరియు ఎస్సి సంఘము పెద్దలు, బేడా బుడగ జంగం సోదరులు పాల్గొన్నారు.