అర్ధవీడు మండలంలో పర్యటించిన బెల్లంకొండ సాయిబాబా

అర్ధవీడు మండలం, పాపినేనిపల్లి, అర్ధవీడు గ్రామాలలో గిద్దలూరు జనసేన పార్టీ ఇంచార్జ్ బెల్లంకొండ సాయిబాబా పలువురు ముఖ్య నాయకులను కలవడం జరిగింది. అదేవిధంగా రైతులతో, రైతు కూలీలతో మాట్లాడి వారి సమస్యలను.. మరియు కౌలు రైతు సమస్యలు అడిగి తెలుసుకోవడం జరిగింది. దొనకొండ గ్రామంలో అనారోగ్యంతో బాధపడుతున్న జూటూరు ధనుష్ అనే క్రియాశీలక కార్యకర్తను పరామర్శించి మనోధైర్యాన్ని ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లాసంయుక్త కార్యదర్శి కాల్వ బాల రంగయ్య, అర్ధవీడు మండలం అధ్యక్షుడు కలగట్ల అల్లూరయ్య, తోట కేసన్న, శేషాద్రి నాయుడు, మస్తాన్, బండి రంగయ్య, ఆంజనేయులు, మోహన్ రావు, కొంకల రంగస్వామి, లక్ష్మీనారాయణ,షేక్ రఫీ, మరియు జన సైనికులు పాల్గొనడం జరిగింది.