అమ్మిశెట్టి వాసు చేతుల మీదుగా డాక్టరేట్ ను అందుకున్నరామకృష్ణ

ఓ నిరుపేద దళిత కుటుంబానికి చెందిన యువకుడు.. డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ స్ఫూర్తితో ముందడుగు వేశాడు.. ఆర్ధిక అవాంతరాలను తన మేధస్సుతో జయించాడు. మేనేజ్ మెంట్ విభాగంలో పి.హెచ్.డి. సాధించాడు. ఆచార్య నాగార్జున యూనివర్శిటీ డాక్టరేట్ ను అందుకున్నాడు. అయితే ఆ గౌరవాన్ని తన హృదయంలో ఉన్నత శిఖరంగా గుడికట్టుకున్న జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి అమ్మిశెట్టి వాసు చేతుల మీదుగా స్వీకరించాలన్నది అతని కల.. అందుకు కారణం లేకపోలేదు.. అమ్మిశెట్టి కూడా తనలాగే సామాన్య కుటుంబం నుంచి వచ్చి రాజకీయంగా తనలాంటి ఎంతో మంది యువతకు పోరాట స్ఫూర్తి నింపారన్నది అతని భావన.

గుడివాడ నియోజకవర్గం, బిల్లపాడు గ్రామానికి, చెందిన ఆ యువకుడు గోగులమూడి. రామకృష్ణ శుక్రవారం తన కలను నెరవేర్చుకున్నాడు. విజయవాడలోని అమ్మిశెట్టి వాసు కార్యాలయానికి వెళ్లి పి.హెచ్.డి. పట్టాను ఆయనకు అందించి.. తిరిగి అమ్మిశెట్టి చేతుల మీదుగా దాన్ని స్వీకరించాడు. విశ్వవిద్యాలయం ఇచ్చిన పట్టాను అమ్మిశెట్టి చేతుల మీదుగా స్వీకరించిన తర్వాతే తన పేరు ముందు డాక్టర్ అని పెట్టుకోవాలని భావిస్తున్నట్టు చెప్పాడు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జనసేన అనే ఒక మహావృక్షాన్ని పెంచి యువతలో స్ఫూర్తిని నింపితే.., ఆ మహావృక్షం నుంచి వచ్చిన శాఖలు కూడా ప్రతి అడుగులో యువతకు స్ఫూర్తి నింపుతోందనడానికి ఇది ఒక నిదర్శనం.. ఈ కార్యక్రమంలో గుడివాడ నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు సందు, పవన్, పేర్ని. జగన్, కృష్ణాజిల్లా జనసేన పార్టీ కార్యదర్శి, జనసైనికులు, బుల్ల. త్యాగరాజు(కింగ్) షేక్ రబ్బాని, గడ్డం శివ రామకృష్ణ, తదితరులు పాల్గొన్నారు.