పెంచిన విద్యుత్ చార్జీలు తగ్గించాలని.. భీమిలి జనసేన ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ

పెంచిన విద్యుత్ చార్జీలు తగ్గించాలని, అప్రకటిత కరెంటు కోతలు నిలుపుదల చేసి, నిరంతర కరెంట్ సరఫరా ఇవ్వాలని, అదే విధముగా వైస్సార్సీపీ ఎన్నికల సమయమందు హామీ ఇచ్చిన విధంగా 200 యూనిట్స్ ఉచిత కరెంట్ కూడా నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ భీమిలి నియోజకవర్గంలో జనసేన ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో భీమిలి జనసేన నాయకులు, వీరమహిళలు, జనసైనికులు భారీ సంఖ్యలో పాల్గొని నిరసన తెలిపారు.