తొలి తెలుగు అశోక చక్ర గ్రహీత విశాఖ సౌర్య దీపికా కీ.శే. కరణం వరప్రసాద్ స్మరిస్తూ మెగా రక్తదాన శిబిరం

విశాఖ, భారతమాత ముద్దు బిడ్డ తొలి తెలుగు అశోక చక్ర గ్రహీత విశాఖ సౌర్య కీ.శే. కరణం వరప్రసాద్ 9వ వర్ధంతి సందర్భంగా తాసుబెల్లి ఫౌండేషన్ మరియు కరణం వరప్రసాద్ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో మదర్ బ్లడ్ బ్యాంకు వారి సౌజన్యంతో మెగా రక్తదానం శిబిరం మార్టూరు గ్రామం, అనకాపల్లి మండలంలో ఏర్పాటుచేయడం చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి విశేష స్పందన వచ్చింది విశాఖపట్నం రిటైర్డ్ మాజీ సైనికులు అసోసియేషన్ మెంబెర్స్, పోలీస్ సిబ్బంది, సైనికులు, యువకులు, రక్తదాతలు పాల్గొని వరప్రసాద్ గారు దేశానికీ చేసిన సేవలను గుర్తుంచుకుంటూ ప్రతి సంవత్సరం విశాఖ జిల్లాలో పలు సేవాకార్యక్రమాలు చేస్తున్నారు అని, ఇంకా ఎక్కువగా సేవాకార్యక్రమాలు వరప్రసాద్ ఆశయాన్ని ప్రజలకి సమాజంలోకి తీసుకొని వెళ్తున్నారు అని గ్రామ ప్రజలు కుటుంబసభ్యులుని అభినందించారు, ఈ కార్యక్రమానికి తల్లితండ్రులు కరణం వెంకటరావు సత్యవతి, అక్క కరణం కళావతి, దాంట్ల నాగేశ్వరరావు, చైతన్య మురళీధర్, కరణం సాయి, గిరీష్, తాసుబెల్లి ఫౌండేషన్ స్థాపకులు శంఖర్ నాయుడు, దారబాబు, పి.ఎన్. మూర్తి, అమ్మ బ్లడ్ బ్యాంకు కిరణ్, గణేష్ కొమ్మోజు తదితరులు పాల్గున్నారు.