ప్రజల జీవితాల్లో మార్పు తేవడమే మాధ్యేయం: కరిమజ్జి మల్లీశ్వర రావు

ప్రతీ గ్రామంలో ప్రభుత్వంపై వ్యతిరేకత ఉంది.. ప్రభుత్వం చేసిన తప్పిదాలను ఎత్తి చూపిస్తూ.. జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఇచ్చిన స్పుర్తితో అలుపెరుగని పర్యటన చేస్తూ.. ఎచ్చెర్ల నియోజకవర్గం జనసేన పార్టీ నాయలు కరిమజ్జి మల్లీశ్వర రావు సామాన్య ప్రజల కష్ట నష్టాలను తెలుసుకుంటూ.. ముందుకు సాగుతున్నారు. సామాన్యుడు పొద్దున్న లేస్తే చెత్త పన్ను, నిత్యవసర ధరల పెంపు, కరెంట్ బిల్ పెంపు, ఇంటిలో ఉందాం అంటే కరెంట్ కోత, పేద వాడికీ పని లేదు, చిన్న వాడికి ఉపాధి లేదు, నడుము విరిగే రోడ్లు, గొంతుకు అరిన తాగునీటి ఇక్కట్లు, అన్నీ ఇంటి వద్దనే.. ఎది ఎప్పుడు అందుతుంది తెలియని ఆచరణ, పథకానికి ఒక సర్వే, సర్వే కి ఒక మెలిక, అడిగితే గొడవ, ప్రశ్నిస్తే కేసుధరల బారం సామాన్యుడు పోరాటం. ఇన్ని సమస్యలతో సతమత మవుతున్న సామాన్యుల జీవితాలలో మార్పు రావాలనే దృక్పథంతో ప్రతి గ్రామాల్లో మార్పు రావాలని దృక్పథంతో జనసేన పార్టీ సిద్ధాంతాలు మరియు మ్యాన్ ఫెస్టో గురించి ప్రజలకు అర్ధమయ్య రీతిలో విన్నవించి పవన్ కళ్యాణ్ గారు ప్రజలకు చేసిన సేవాకార్యక్రమాలు ప్రజలకు వివరిస్తూ.. ఈసారి జనసేనపార్టీకి ఓటు వేసి 2024సం”లో జనసేనపార్టీని అధికారంలోకి తీసుకు రావాలని ప్రజా ప్రభుత్వాన్ని నిర్మీంచుకోవాలని కరిమజ్జి మల్లీశ్వారావు మరియు పోట్నూరు లక్ష్మునాయుడు ప్రజలను కోరుతూ.. జనసేన పార్టీ అధికారంలోకి వస్తే అమలు చేసే పధకాలను ప్రజలకు వివరించడం జరిగింది.
1.సంవత్సరాని 5గ్యాస్ సిలిండర్లు ప్రీ
2.తెల్ల రేషన్ కార్డుకి ఇసుక ప్రీ
3.బియ్యం బదులు ఎకౌంటు లో 2500 నుండి 3500/వరకు ఇవ్వడం జరుగుతుంది.
4.వృద్దులు కోసం ప్రభుత్వం ఆశ్రమాలు
ఈ కార్యక్రమంలో స్ధానిక గ్రామ నాయకులు జనసైనుకులు రాజ్ శేఖర్, ఈశ్వరరావు, సురేష, ప్రసాద్, పవన్ కూమార్, దాము, హరి, సాయి తదితరులు పాల్గొన్నారు.