ఆన్‌లైన్‌ గేమింగ్‌ చట్టంలో ఏపీ ప్రభుత్వ సవరణలు

ఆన్‌లైన్‌ గేమింగ్‌ చట్టంలో ఏపీ ప్రభుత్వం సవరణలు చేసింది. ఆన్‌లైన్‌ రమ్మీలాంటి జూదాన్ని నిషేధిస్తూ ప్రభుత్వ ఆదేశాలు జారీ చేసింది. ఆన్‌లైన్‌లో రమ్మీ ఆడినా, నిర్వహించినా రెండేళ్ల జైలు శిక్షతో పాటు భారీ జరిమానా విధించేలా ఈ మేరకు చట్ట సవరణ చేసింది.

ఆన్‌లైన్‌లో చిన్న పిల్లలు, యువత  రమ్మీకి ఎక్కువగా బానిస అవుతున్నారు. అంతేకాదు అందుకోసం భారీగా డబ్బులను వెచ్చిస్తున్నారు. మరోవైపు ఆన్‌లైన్‌లో గ్యాంబ్లింగ్‌ ఘటనలు జరుగుతున్నాయి. రమ్మీ పేరిట మోసాలు పెరుగుతున్నాయి. ఎంతోమంది బాధితులు తమ డబ్బును పోగొట్టుకుంటున్నారు. దీంతో ఆన్‌లైన్‌ రమ్మీని నిషేధించాలని డిమాండ్లు పెరిగాయి. ఈ నేపథ్యంలో దీనిపై ఆలోచించిన ఏపీ ప్రభుత్వం.. వీటిపై నిషేధం విధించింది.