అఘాయిత్యానికి గురి అయిన మానసిక వికలాంగులరాలికి న్యాయం చేయాలి: జనసేన డిమాండ్

విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో నగర అధ్యక్షుడు పోతిన మహేశ్ సూచనతో అఘాయిత్యానికి గురి అయిన మానసిక వికలాంగులరాలికి న్యాయం కోసం జనసేన పార్టీ సెంట్రల్ వీరమహిళల అధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జనసేన సెంట్రల్ నాయుకులు బొలిశెట్టి వంశీకృష్ణ మాట్లాడుతూ.. మానసిక వికలాంగురాలికి న్యాయం చేయాలి.. తక్షణమే 50లక్షలు పరిహారాన్ని ప్రకటించాలి.. అని అన్నారు, అలాగే స్థానిక ఎమ్మెల్సీ రుహుల్ల నేరస్తులకు అండగా నిలబడినప్పుడే తెలుస్తుంది వైసిపి ప్రభుత్వానికి మహిళలపై ఎంత గౌరవం ఉందో, ఎమ్మెల్యే మల్లాది విష్ణు బాధిత కుటుంబానికి న్యాయం చేయకపోగా.. ప్రతిపక్షాలు రాద్ధాంతం చేస్తున్నారని అంటున్నారు. మల్లాది విష్ణు, వెల్లంపల్లి శ్రీను, దేవినేని అవినాష్ మీ ముగ్గురు సీఎం జగన్ రెడ్డితో మాట్లాడి అభాగ్యురాలికి ఎందుకు నష్టపరిహారం ఇప్పించలేకపోయారు. అక్రమ స్లాబుల మీద ఉన్న శ్రద్ధ.. బాధిత మహిళ మీద లేదా అని అడుగుతున్నాను. సీఎం గారు కూడా ఒక ఆడపిల్ల తండ్రిగా ఆలోచించి ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన వీరమహిళలు శిరీష, అలియా బేగం, ఉదయ లక్ష్మి, పసుపులేటి రాణి, నగర ఉపాధ్యక్షులు కమళ్ల సోమనాథం, డివిజన్ అద్యక్షులు కుప్పల శ్రీనివాస్, భవాని కుమార్, పైల ప్రకాష్, సిద్దు, రాము, బెనర్జీ, మొహమ్మద్ మొదలగు వీరమహిళలు, జనసైనికులు పాల్గొన్నారు.