తిరుపతి రుయా ఆసుపత్రి రాష్ట్రానికే తలమానికం – కానీ అక్కడ జరుగుతున్న సంఘటనలు మాత్రం దురదృష్టకరం: జనసేన

  • రుయా హాస్పిటల్ లా…లేక వైసిపి హాస్పిటల్ లా…?

తిరుపతి, బుధవారం స్థానికి తిరుపతి ప్రెస్ క్లబ్ నందు మీడియా సమావేశంలో కిరణ్ రాయల్ జనసేన తిరుపతి అసెంబ్లీ ఇన్చార్జి మాట్లాడుతూ.. రుయాలో వేసిన ప్రతి టెండర్ వైసిపి నేతలు హస్తగతం చేసుకున్నారు, ఒక చిన్న బిడ్డ చనిపోతే అక్కడ అంబులెన్స్ మాఫియా అరాచకం సృష్టించారు, ఆ బాలుడు తండ్రిని డిమాండ్ చేసిన 20 వేల రూపాయల్లో ఎంతమందికి వాటాలు వెళ్తున్నాయి, ఇందులో వైసిపి నేతలు హస్తం ఉందా..? తిరుపతిలోని కార్పొరేటర్లు 50 రూపాయల నుంచి లక్షల రూపాయలు వసూలు చేస్తున్నారు, నిన్న జరిగిన ఘటనలో దళిత సామాజిక వర్గనికి చెందిన అధికారిని సస్పెండ్ చేశారు, అదే వైసిపి సామాజిక వర్గానికి చెందిన వారిపై చర్యలు తీసుకోగలరా…? గతంలో రుయా ఆస్పత్రిలో ఆక్సిజన్ లేక చేనిపోతే వైసిపి నేతలు చెప్పిన వారికి మాత్రమే నష్టపరిహారం ఇచ్చారు, చెలివెంద్రం ప్రారంభోత్సవానికి మంత్రులు, ఎమ్మెల్యే లు వెళ్తారు, రుయా లో మీ అవినీతి కారణంగా దురదృష్ట సంఘటన జరిగితే అక్కడికి వచ్చే నాధుడే లేడు, వైద్య శాఖ మంత్రి కి ఐటీ శాఖ మంత్రి ఇచ్చి ఉంటే బాగుండేది, ఆమె సోషల్ మీడియాలో తప్ప పరోక్షంగా పని చేయరు కనుక, తిరుపతి మెటర్నిటీ ఆసుపత్రిలో దొంగలు ఎక్కువైయ్యారు, అక్కడ ఆడ బిడ్డ పుడితే ఒక రేటు, మోగ బిడ్డ పుడితే ఒక రేటు అక్కడ సిబ్బందికి ఇవ్వాలి, తిరుపతి రుయా ఆసుపత్రిలో ఒపి తీసుకొని వెళ్తే, డెత్ సర్టిఫికెట్ తో బయటకు వస్తున్నారు. తిరుపతి రుయా వైద్యులు, వారి సొంత ప్రైవేట్ ఆసుపత్రులకు రోగులను పంపిస్తూ దోచుకుంటున్నారు అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

పట్టణ అధ్యక్షులు రాజారెడ్డి మాట్లాడుతూ.. రుయా ఘటన దురదృష్టకరం, అంబులెన్స్ మాఫియా వెనుక రాజకీయ నాయకులు ఉన్నారు, సంబంధం లేని అధికారిని సస్పెండ్ చేసి చేతులు దులుపుకున్నారు, నిర్దేశించిన ధరలు ఎందుకు నిర్ణయించడం లేదు, ఎవరెవరికి ఎంతేత కమిషన్ వెళ్తోంది అని అన్నారు.

రాజేష్ యాదవ్ మాట్లాడుతూ.. ధర్మసుపత్రిలో ధర్మము లేదు, అడుగడుగునా చేతివాటం చూపిస్తున్నారు, ఒక రోగి ఆరోగ్యం బాగాలేక, ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్ళలేక ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్తే అక్కడ కార్పొరేట్ ఆసుపత్రి తరహాలో దోపిడి చేస్తున్నారు ఇలాంటి సంఘటనలను జనసేన పార్టీ తరపున తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు.

ఈ మీడియా సమావేశంలో జిల్లా ఉపాధ్యక్షులు మధు బాబు, బాబ్జి, సుమన్ బాబు, హేమ కుమార్, రాజేష్ లు పాల్గొన్నారు.