తొస్సీపూడి గ్రామ జనసేన యువత ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు

అనపర్తి నియోజకవర్గం, బిక్కవోలు మండలం, తొస్సీపూడి గ్రామంలో జనసేన యువత ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా రోడ్డు మీద వెళ్లే వాహనదారులకు బుధవారం బట్టర్ మిల్క్ పంపిణి చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ జనసేన యూత్ నాయకుడు తేతలి వెంక రెడ్డి, దుర్గా రెడ్డి, ఎస్.ఎన్.కే, రాకేష్, రాజు, గణేష్, శ్రీహరి తదితరులు పాల్గొన్నారు.