ఓరేయ్ బుజ్జిగా ట్రైలర్

రాజ్ తరుణ్‌, మాళవికా నాయర్, హెబ్బా పటేల్‌ నాయకా నాయికలుగా నటిస్తున్న చిత్రం ‘ఒరేయ్‌ బుజ్జిగా’. శ్రీ సత్యసాయి ఆర్ట్స్‌ పతాకంపై కె.కె.రాధామోహన్‌ ఈ చిత్రాన్ని నిర్మించారు. గాంధీజయంతి సందర్భంగా అక్టోబర్‌ 2న ఆహా ఓటీటీ ద్వారా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకురానున్నది. కుటుంబ విలువలతో ముడిపడిన యూత్‌ఫుల్‌ లవ్‌ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం రూపొందగా, తాజాగా చిత్ర ట్రైలర్ విడుదలైంది.

అక్కినేని నాగ చైతన్య తన ట్విట్టర్ ద్వారా ఒరేయ్ బుజ్జిగా చిత్ర ట్రైలర్ రిలీజ్ చేశారు. ట్రైలర్ చూస్తుంటే ఈ సారి రాజ్ తరుణ్ హీట్ ఖాయమనే అనిపిస్తుంది. చిత్రంలో మనల్ని నవ్విస్తూనే మనసుల్ని కదిలించే భావోద్వేగాలుంటాయని తెలుస్తుంది. నాదొక బ్యూటిఫుల్, ఫెంటాస్టిక్ మార్వలెస్ లవ్ స్టోరీ అనే డైలాగ్ ఈ సినిమాను ఎక్కడికో తీసుకెళ్తుందని అందరూ అనుకుంటున్నారు. రాజ్‌తరుణ్‌, మాళవికానాయర్‌ కెమిస్ట్రీ ఆకట్టుకుంటుంది. వాణీ విశ్వనాథ్‌, నరేష్‌, పోసానికృష్ణమురళి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం అనూప్‌ రూబెన్స్ అందించారు.