నిరాహార దీక్ష భగ్నం చేయడానికి ప్రయత్నిస్తే.. సామూహిక ఆత్మహత్యలకు సిద్దం: పాటంశెట్టి

గోకవరం మండలం, అచ్యుతాపురం గ్రామం మధ్య నుండి ఐఓసిఎల్ కేంద్రానికి విద్యుత్ సరఫరా కోసం చేపట్టిన విద్యుత్ టవర్ లైన్ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ.. జగ్గంపేట నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ పాటంశెట్టి సూర్యచంద్ర, శ్రీదేవి దంపతులు గ్రామస్థులతో కలిసి గురువారం చేపట్టిన దీక్ష నేటికీ 3వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా.. శిబిరాన్ని స్థానిక డి.ఎస్.పి కదలి వెంకటేశ్వరరావు, కోరుకొండ పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్ పవన్ కుమార్ రెడ్డి, గోపవరం తాసిల్దార్ పోసిబాబు, గోకవరం ఎస్సై నాగబాబు తదితరులు సందర్శించి దీక్ష విరమించాలని.. సూచిస్తూ చర్చలు జరపగా.. బలవంతంగా ఎవరైనా నిరాహార దీక్ష భగ్నం చేయడానికి ప్రయత్నిస్తే.. గ్రామ ప్రజలంతా కలసి సామూహిక ఆత్మహత్యలు చేసుకుంటామని.. గ్రామం మధ్య నుండి విద్యుత్ లైన్ ఏర్పాటు చేయవద్దని అధికారులకు వినతిపత్రం ఇదివరకే ఇవ్వడం జరిగిందని. ప్రత్యామ్నాయ మార్గంలో దగ్గరి దారిలో ఈ లైన్ నిర్మాణం చేయడం వల్ల గ్రామానికి ఇబ్బంది ఉండదని అయినప్పటికీ నిర్మాణ పనులు చేపట్టారని తక్షణమే ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని ఈ పనులు నిలిపివేయాలని పాటంశెట్టి డిమాండ్ చేశారు.

This image has an empty alt attribute; its file name is patam-1024x576.jpg