తెలంగాణ కాంగ్రెస్‌ నేతల అరెస్టు

కేంద్రం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలపై నిరసనగా గాంధీబవన్ నుండి రాజ్ భవన్ వరకు కాంగ్రెస్ ర్యాలీకి పిలుపునిచ్చింది. రాజ్ భవన్ కు వెళ్తున్న కాంగ్రెస్ వ్యవహరాల ఇంచార్జ్ మాణిక్యం ఠాగూర్, పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎంపీ రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే శ్రీధర్ బాబు, సీతక్క తదితరులను దిల్ కుషా గెస్ట్ హౌజ్ వద్ద పోలీసులు అరెస్ట్ చేసి గోషామహల్ పోలీస్ట్ స్టేషన్ కు తరలించారు. దేశానికి వెన్నుముకగా ఉన్న రైతుకు ఇబ్బంది కలిగించేలా కేంద్రం తెచ్చిన మూడు చట్టాలపై కాంగ్రెస్ పోరాడుతుందని నేతలన్నారు. టీఆర్ఎస్, బీజేపీలు రైతు వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్నాయని ఆరోపించారు.

తెలంగాణలో గవర్నర్ ను కలిసే స్వేచ్ఛ కూడా లేకుండా పోయిందని నేతలు మండిపడ్డారు. బిల్లులో మద్ధతు ధర కన్నా ఎక్కువగా రైతులకు ధర కల్పించాలన్న అంశమే లేదని పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు.