ప్రభుత్వం మహిళలకు ఎలాంటి రక్షణ ఇవ్వడం లేదు: వజ్రగడ రవికుమార్, పుండరికం

ఆంధ్రప్రదేశ్ లో దారుణమైన సంఘటన రేపల్లె లో రైల్వే స్టేషన్ ప్లాట్ ఫారంపై ఒక నిండు గర్భిణీ పై సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన జరిగింది. మరి ఆ దారుణం మరువక ముందే.. విజయనగరం జిల్లాలో మరో సంఘటన.. ఉడాకాలనీ లో ఉంటున్న ఓ వివాహిత తన ఇద్దరు పిల్లలును మంచిగా చదివించుకోవడానికి ఒక టీ దుకాణంలో పని చేసుకుంటుంది. కొంతమంది రాత్రి పదకొండు గంటల సమయంలో ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. అంటే ఇది ముమ్మాటికీ ప్రభుత్వం వైఫల్యమే.. వైసీపీ సీఎం, ఎమ్మెల్యేలు, మంత్రులు, కార్యకర్తలు, ఇలా అందరూ కూడా దిశ చట్టం గురుంచి చాలా గొప్పలు చెప్పుకుంటున్నారు.. కానీ దిశ చట్టం పూర్తిస్థాయిలో అమలుకి నోచుకోవడం లేదు. దిశ చట్టం సక్రమంగా అమలు చేస్తే ఇలాంటి ఘటనలు జరగవు. కనుక ఈ ప్రభుత్వం మహిళలకు ఎలాంటి రక్షణ ఇవ్వడం లేదని పార్వతీపురం జిల్లా పాలకొండ నియోజకవర్గ వీరఘట్టం మండల జనసేన నాయుకులు వజ్రగడ రవికుమార్(జానీ), పుండరికం మండిపడ్డారు.