కోవెలకుంట్లలో తాగునీటి సమస్యను పరిష్కరించండి: జనసేన

కోవెలకుంట్ల పట్టణంలో త్రాగునీటి సమస్యతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వెంటనే సమస్యలను పరిష్కరించాలని జనసేన పార్టీ జిల్లా పార్టీ కార్యక్రమాల నిర్వహణ కమిటీ సభ్యులు చిన్నబాబు, నాయకులు పత్తి సురేష్ బాబు, గురప్ప, బోధనం ఓబులేసు, నాగప్రసాద్, చిన్న కిట్టు, విజయ్ ఆధ్వర్యంలో పట్టణంలోని మినరల్ వాటర్ ప్లాంట్ ను గ్రామీణ రక్షిత నీరు పథకం (ఆర్.డబ్ల్యు.ఎస్) పరిశీలించి ప్రజల అభిప్రాయాలను తెలుసుకున్నారు. కోవెలకుంట్లలో త్రాగునీరు 8 బోర్లు, ఒక డైరెక్ట్ పంపింగ్, ఆర్.డబ్ల్యు.ఎస్ మరియు ఉచిత మినరల్ వాటర్ ప్లాంట్స్ ద్వారా సరఫరా అవుతుంది. అయితే మినరల్ వాటర్ ప్లాంట్స్ లో నీటి సుద్ధి సరిగా చేయకపోవడం అలాగె కొన్ని ప్లాంట్స్ చెడిపోపడం వల్ల తాగునీటికి ఇబ్బందులు పడుతున్నారు. ప్రధానంగా పట్టణంలోని దాసరి వీధి, సుంకులమ్మ దేవాలయం సమీపంలో, ఇందిరమ్మ కాలనీలో అలాగే మరికొన్ని చోట్ల వాటర్ ప్లాంట్స్ లేకపోవడం వల్ల త్రాగు నీటి కోసం ప్రజలులు దూర ప్రాంతాలకు వెళ్లి నీటిని తెచ్చుకుంటున్నారు. అలాగె ప్రైవేట్ ప్లాంట్ నుంచి వచ్చే నీటిని కొని వినియోగించుకుంటున్నారు.త్రాగు నీటి సరఫరాకు చాలా వనరులు ఉన్నప్పటికీ ప్రైవేట్ ప్లాంట్స్ ద్వారా నీటిని కొనుక్కోవడం సమస్య తీవ్రతకు అద్దం పడుతోంది.మినరల్ వాటర్ ప్లాంట్స్ లో సరిగా నీటిని శుద్ధి చేయకపోతే అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉందని ప్రజలు ఆందోళన చెందుతున్నారు.కొన్ని ప్లాంట్స్ దగ్గర టైల్స్ ఏర్పాటు చేయకపోవడంతో కలుషితమైన వాతావరణం లో నీటి సరఫరా జరుగుతోంది. పట్టణంలో త్రాగు నీటి విషయంలో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను జనసేన నాయకులు గ్రామ పంచాయతీ ఈఓ బాలఆంజనేయులు, ఉప సర్పంచ్ సూర్యనారాయణ రెడ్డి, ఆర్డబ్ల్యూఎస్ అధికారులకు వినతి పత్రాలను అందజేశారు. పట్టణంలో నెలకొన్న తాగునీటి సమస్యను వెంటనే పరిష్కరించాలని జనసేన నాయకులు ప్రజా ప్రతినిధులు మరియు అధికారులను కోరడంతో వారు సానుకూలంగా స్పందించి సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు.