జగన్ జైలుకి – పవన్ పవర్ లోకి.. ఇదే జరగబోయే అద్భుతం: జనసేన

*మహిళలపై జరుగుతున్న దాడులను, సమస్యలను పక్కనబెట్టి పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేస్తే మెప్పులు పొందగలమని అనుకుంటున్నారు..

*మీ జీవితంలో మీ సొంత డబ్బులు ముప్పై కోట్ల రూపాయలు ప్రజల కోసం ఖర్చు పెట్టగలరా..?

*పరిపాలన పై శ్రద్ధ పెట్టండి – ప్రచారాల పైన కాదు.. జనసేన

కౌలు రైతులకు ముప్పై కోట్ల రూపాయలు సొంత డబ్బులు జనసేన అధినేత మా పవన్ కళ్యాణ్ ఇవ్వడం చూసి మాకు ఎక్కడ మంచి పేరు వస్తుందో అని ఓర్వలేక మా పై విమర్శలా? మీ 151 మంది ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ ఒక్క రూపాయి అయినా కరోనా కష్టకాలంలో కానీ, ఆత్మహత్య చేసుకున్న రైతులకు కానీ ఇచ్చారా..? పోనీ మీరు మీ జీవితంలో ముప్పై కోట్ల రూపాయలు ఇవ్వగలరా..? మీరు కూడా మాట్లాడటం సిగ్గుచేటు, చనిపోయిన కౌలు రైతుకు లక్షల‌ రూపాయలు పరిహారం చెల్లిస్తున్నారు మా అధ్యక్షులవారిని..

కౌలు రైతులకు పరిహారం చెల్లించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలం అయ్యింది పవన్ కళ్యాణ్ బయటకు వస్తే మంత్రులు అంతా భయ పడుతున్నారు, పవన్ కళ్యాణ్ ని విమర్శిస్తే మంత్రులను వీధుల్లో‌ తిరగనీయకుండా చేస్తాం.. పొత్తులపై ఆదివారం వైసీపీ మంత్రులు చేసిన విమర్శలకు జవాబుగా జనసేన సోమవారం తిరుపతి ప్రెస్ క్లబ్ నందు ప్రెస్ మీట్ నిర్వహించి వైసిపి మంత్రులకు ఘాటుగా.. ధీటుగా ఇంచార్జ్ కిరణ్ రాయల్, పట్టణ అధ్యక్షలు రాజారెడ్డి, జిల్లా ప్రధాన ప్రధాన కార్యదర్శులు రాజేష్ యాదవ్ మరియు సుమన్ బాబు, మునస్వామి, సుమన్, సాయిదేవ్, రాజేష్, కోమల్ లు బదులు ఇచ్చారు.. పవన్ కళ్యాణ్ విమర్శించే స్ధాయి వైసీపి ప్రభుత్వానికి లేదు.. రాబోవు ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ఏపి సీఎం కాబోతున్నారు. పోత్తుల గురించి పార్టి అధిష్టానం నిర్ణయిస్తుందే కానీ వైసీపికి జనసేన పోత్తుల గురించి అవసరం లేదు. త్వరలో జగన్ జైలుకి.. పవన్ పవర్ లోకి రావడం ఖాయం ఇదే అద్భుతం అని కిరణ్ రాయల్ అన్నారు.

ఏ‌ మంత్రి కూడా తమ శాఖలో ఉన్న సమస్యలు కనుక్కోలేక పోతున్నారు. పవన్ కళ్యాణ్ విమర్శించే హక్కు మంత్రులకు లేదు.. ముందు మీ శాఖలపై మీరు శ్రద్ధ పెట్టండి, గత ప్రభుత్వం మంత్రులు పవన్ కళ్యాణ్ ను విమర్శించి దిక్కు లేని స్ధితిలో పడ్డారు. వైసీపి డబుల్ డిజిట్ కే పరిమితం కానున్నారు. ఏపిలో‌ ఖచ్చితంగా రాబోవు కాలంలో మధ్యంతర ఎన్నికలు రానుంది. మీరు ఈ రాష్ట్రాన్ని సుభిక్షంగా పరిపాలిస్తున్నాం అని అంటున్నారు.. మరి ప్రతి నెలా ఆర్ధిక శాఖా మంత్రి బొచ్చె ఎత్తుకుని ఢిల్లీకి ఎందుకు వెళ్తున్నారు..?

దివాల తీసి దిక్కు లేని‌ ప్రభుత్వంగా వైసీపి తయారు అయ్యింది. బూతు మంత్రులకు అందరినీ జనసేన పార్టీ తరపున హెచ్చరిస్తున్నాం అని ఆగ్రహం వ్యక్తం చేశారు

రాష్ట్రంలో మహిళ భధ్రతను గాలికి వదిలి.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను విమర్శించే పనిలో వీరు పడ్డారు. త్వరలో ఏపిలో వింత జరుగబోతుంది.. వైసీపి నాయకులే త్వరలో చూడబోతున్నారు.. వైసీపి ప్రభుత్వంకు దమ్ము ఉంటే రాజీనామా చేసి మాతో ఎన్నికలకు రావాలి అని జనసేన పార్టి తరపున సవాల్ చేశారు.