వైసీపీ కి మద్దతు ఇవ్వాలని భయబ్రాంతులకు గురిచేస్తున్న వ్యక్తులకు అండగా బెజవాడ దినేష్

పీలేరు నియోజకవర్గం, వాయల్పాడు జనసేన మండల కమిటీ సభ్యులు పత్తేపురం కి చెందిన బాలు, శివ, నరేష్ లను స్థానిక ఎమ్మెల్యే చింతల రామచంద్రా రెడ్డి మరియు వైసీపీ నాయకులు ఉద్దేశపూరితంగా, కక్షసాధింపు చర్యలో భాగంగా ప్రభుత్వం ఇచ్చిన కాలనీ ఇళ్లకు సంబంధించిన బిల్లులను రాకుండా ఇబ్బందులకు గురి చేయటమే కాకుండా వైసీపీ కి మద్దతు ఇవ్వాలని భయబ్రాంతులకు గురిచేస్తున్నారు. విషయం తెలుసుకొని జనసేన పార్టీ పీలేరు ఇన్ ఛార్జ్ బెజవాడ దినేష్ బాధితుల ఇంటికి వెళ్లి ధైర్యం నింపి, జనసేన పార్టీ ఎల్లవేళలా మీకు తోడుగా ఉంటుంది అని భరోసా ఇచ్చి.. చట్టప్రకారం లబ్ధిదారులకి రావాల్సిన బిల్లులను వచ్చేలా అధికారులతో మాట్లాడి తగుచర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చి వచ్చారు. ఈ కార్యక్రమంలో చిత్తూరు జిల్లా కార్యదర్శి ఆర్ కే బాటసారి, వాయల్పాడు మండల ఇంచార్జి మండెం కిషోర్, ఉపాధ్యక్షుడు అమ్మిట్టి సందీప్ కుమార్, నిమ్మనపల్లి మండల ఇంచార్జి ప్రదీప్ సింగ్, మండల కమిటీ సభ్యులు భాస్కర్, హర్ష, పవన్, ప్రశాంత్, బాలరాజు, గురు ప్రసాద్, వేణు, దిలీప్, సాయి, భరత్, బాలాజీ, ధనుష్, సుకు కుమార్, రాజ్ కుమార్, రెడ్డి శేఖర్, ప్రసాద్, ప్రియాంక పాల్గొన్నారు.