ఉపాధ్యాయులను సస్పెండ్ చేయాలి..!

భైంసా పట్టణం లోని విశ్రాంత ఉద్యోగ భవనంలో విద్యార్థి సంఘం ప్రజా సంఘం, రాజకీయ పార్టీల ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో నాయకులు మాట్లాడుతూ సమసమజ నిర్మాణంలో కీలక పాత్ర పోషించాల్సిన ఉపాధ్యాయులు నేటి బాలల్ని రేపటి బావి భారత పౌరులుగా తీర్చి తీర్చిదిద్దాల్సినటువంటి ఉపాధ్యాయులు మద్యం సేవిస్తూ.. పేకాట ఆడుతూ.. భహిరంగంగా పట్టు బడటం చాలా విచారకరమైన విషయం. నిన్న పి ఆర్ టి యు యూనిట్ సంఘం భవనంలో ప్రభుత్వ ఉపాధ్యాయులు కొంత మంది పేకాట రాయుల్లతో కలిసి (జూదం)పేకాట ఆడటం దారుణం అని తెలియచేస్తూ.. ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తూ.. ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లా మరియు మండల విద్యా శాఖ అధికారులు ఇట్టి ఆంశాన్ని యుద్ద ప్రాతి పాదికన విచారణ జరిపించి.. పి ఆర్ టి యు రాష్ట్ర నాయకత్వం చొరవ తీసుకుని వారి యొక్క ప్రాథమిక సభ్యత్వాన్ని రద్దు చేసి, వేరే ఇతర పేకాట రాయుళ్లను పోలీస్ శాఖ వెంటనే అరెస్ట్ చేసి చట్ట పరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం.. లేని యెడల ప్రభుత్వ జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో, జిల్లా విద్యా శాఖ మరియు అన్ని మండల కేంద్రాల్లో.. ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాలు, అఖిల పక్ష నాయకులతో కలిసి దశల వారిగా పోరాటాలు నిర్వహిస్తామని తరపున హెచ్చరిస్తున్నాం అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఉపాధ్యక్షులు సుంకెట మహేష్ బాబు, ఆమ్ ఆద్మీ పార్టీ జిల్లా ఇంఛార్జి జావిధ్ ఖాన్, ఎన్ ఎస్ యూ ఐ జిల్లా బాధ్యులు షేక్ ఆంజాధ్, ఎన్ ఎస్ యూ ఐ భైంసా పట్టణ అధ్యక్షులు
స్వప్నిల్, ఏ ఐ ఎస్ బి రాష్ట్ర కార్యదర్శి జావరే రాహూల్, యూత్ కాంగ్రెస్ భైంసా పట్టణ అధ్యక్షులు కుంట రవి కుమార్.. లు పాల్గొన్నారు.