దీపావళికి అక్షయ్ ‘లక్ష్మీ బాంబ్’

దక్షిణాదిన అద్భుత విజయాన్ని సొంతం చేసుకున్న ‘కాంచన’ సినిమాను బాలీవుడ్‌లో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ రీమేక్‌లో అక్షయ్ కుమార్ ప్రధాన పాత్ర పోషిస్తున్నాడు. ఈ రీమేక్‌ ‘లక్ష్మి బాంబ్’ పేరుతో సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. రాఘవ లారెన్స్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ ఇటీవలే పూర్తయింది. గతంలో విడుదలైన అక్షయ్ కుమార్ లేడీ గెటప్ కు సంబంధించిన ఫస్ట్ లుక్ కూడా అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది. పాత్రకు తగ్గట్టుగా అక్షయ్ కుమార్ పర్ఫెక్ట్ గా సెట్ అయ్యాడు. ఈ సినిమాను మొదట ఓటీటీలో రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ అనుకున్నా.. ఆ తర్వాత నిర్ణయాన్ని మార్చుకున్నారు. ఇప్పుడు ఈ సినిమా థియేటర్స్ లో విడుదల కానుంది, కానీ మనదగ్గర కాదు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, యుఎస్ఏ లో దీపావళి కానుకగా నవంబర్ 9న లక్ష్మీబాంబ్ విడుదల కానుంది. ఇందుకు సంబందించిన పోస్టర్ ను విడుదల చేసింది చిత్రయూనిట్. ఇండియా థియేటర్స్ ఓపెన్ అయ్యిన వెంటనే ఇక్కడ కూడా ఈ సినిమాను విడుదల చేయనున్నారు.