గుంటుపల్లి జనసేన ఆధ్వర్యంలో సర్ అర్థర్ కాటన్ జయంతి కార్యక్రమం

*సర్ అర్థర్ కాటన్ కు నివాళులు అర్పించిన పోలిశెట్టి తేజ

గుంటుపల్లి: పక్కనే గోదావరి పోతున్నా పట్టుకోలేని పరిస్ధితి.. కళ్ళ ముందే కృష్ణమ్మ కదులుతున్నా ఏమి చేయలేని పరిస్ధితి.. గోదావరిని ధవేళేశ్వరం ద్వారా ఒడిసిపట్టి.. ప్రకాశం బ్యారేజీతో కృష్ణమ్మను కట్టిపెట్టి.. ప్రజల అవసరాలను తీర్చిన భగీరధుడుగా ప్రజల గుండెల్లో చిరస్దాయిగా నిలిచిపోయిన కాటన్ దొర తనజీవిత కాలమంతా బ్రిటిష్ ఇండియా సమయంలో వ్యవసాయ అభివృద్ధి ప్రాంతాలను అన్వేషించి.. సస్యశ్యామలపరచి నేడు డెల్టా వాసుల అన్నప్రధాతగా కీర్తింప బడుచున్న సర్ అర్ధర్ కాటన్ దొరగారి 219వ జయంతి మహోత్సవ సంధర్భముగా.. ఆయనను స్మరించుకుంటూ.. గుంటుపల్లి గ్రామ జనసేన పార్టీ ఆధ్వర్యంలో కాటన్ దొర చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిధులుగా జనసేన పార్టీ ఎంపీటీసీ మరియు ఇబ్రహీంపట్నం మండల జనసేన అధ్యక్షులు పోలిశెట్టి తేజ, రైతు సంఘం ప్రతినిధి చెరుకూరి వేణుగోపాలరావు, తిరుమలశెట్టి పవన్, పాల్గొన్నారు. ఈ కార్యమాన్ని నిర్వహించిన జనసేన పార్టీ కార్యకర్తలకు చెరుకూరి వేణుగోపాల్ అభినదనలు తెలియజేసారు.