రణస్థలంలో జనసేన భారీ బహిరంగసభ

శ్రీకాకుళం జిల్లా, రణస్థలం మండలం, ఎచ్చెర్ల నియోజకవర్గం కేంద్రాలయం పార్టీ ఆఫీస్ ఓపెనింగ్ తదుపరి తరువాత సుభద్రాపురం జంక్షన్ నుంచి ర్యాలీగా బయలుదేరి తలావలస పంచాయతీ దగ్గర డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీమతి పాలవలస యశస్విని, ఎచ్చెర్ల నియోజకవర్గ జనసేన నాయకురాలు శ్రీమతి కాంతిశ్రీ పూలమాలలు వేసి తదనంతరం రణస్థలం హెడ్ క్వార్టర్ లో జనసైనికులతో అందరితో కలిసి సభ ప్రాంగణానికి చేరుకుని మీడియా మిత్రులతో సమావేశంలో పాల్గొన్నారు. అనంతరం సభను ప్రారంభించడం జరిగింది. ఈ సభా ప్రాంగణంలో లావేరు, రణస్థలం, ఎచ్చెర్ల మండలంలో, సుమారుగా 250 కుటుంబాలు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆశయాలు సిద్ధాంతాలకు ఆకర్షితులై జనసేనలో చేరడం జరిగింది. వీరందరైని బహిరంగ సభలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలవలస యశస్విని, ఎచ్చెర్ల నియోజకవర్గ నాయకులు శ్రీమతి కాంతిశ్రీ లు కండువాలు కప్పి జనసేనపార్టీలోకి ఆహ్వానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యక్రమ నిర్వహణ జాయింట్ కోఆర్డినేటర్ డా విశ్వక్షేణ్, ఎన్ని రాజు, జనసేన నాయకులు కరిమజ్జి మల్లేశ్వరావు, రాష్ట్ర బిసి సంఘ కార్పొరేషన్ అధ్యక్షులు బలరాం, కృష్ణాపురం ఎంపిటిసి అభ్యర్థి లక్ష్మీ నాయుడు, కృష్ణాపురం సర్పంచ్ అభ్యర్థి శంకర్, ఎర్రవరం సర్పంచ్ అభ్యర్థి శ్రీమతి ఎరమ్మ, గురజా శ్రీను, కోలా రాజేష్, గొర్లె సూర్య, బర్నాల దుర్గారావు, రాజా రమేష్, మధు బాబు, కాకర్ల బాబాజీ, ఆనంద్, దుర్గా రెడ్డి, నగరపాలెం సర్పంచ్ అభ్యర్థి వెంకటరమణ, గోపాల్, నవిరీ రాజు, విక్రమ్ సందీప్, మీసాల నాయుడు, ఎర్రయ్య, కాశీ, గణ, లక్ష్మణ్, ప్రసాద్, పపారావు, అప్పలకొండ, సత్య, రాజు, శ్రీను జనసైనికులు కార్యకర్తలు పాల్గొన్నారు.