గూడూరు మండలంలో యథేచ్ఛగా ఇసుక అక్రమ రవాణా

పెడన నియోజకవర్గం, గూడూరు మండలం ముక్కొల్లు పంచాయతీ నాగారం గ్రామంలో ఇసుక మాఫియా ఆగడాలకు అడ్డూ అదుపూ లేదు. పంటకాలంలో మట్టిని మరియు గవర్నమెంట్ భూములొనీ మట్టిని అక్రమంగా తరలిస్తున్నారు. గ్రామస్తులు ప్రశ్నించగా అక్రమార్కులు తిరగబడుతున్నారు. ఈ విషయమై సోమవారం రాత్రి గూడూరు ఎమ్మార్వో తో ఫోన్లో మాట్లాడడం జరిగింది. మా సిబ్బందిని పంపిస్తున్నాను, తప్పక చర్యలు తీసుకుంటాం అని మాట ఇవ్వడం జరిగింది. కానీ ఎలాంటి చర్యలు తీసుకోలేదు. రెవిన్యూ సిబ్బంది అక్కడికి రాలేదు. రాత్రి నుండే తవ్వకాలు ప్రారంభించి విరామం లేకుండా మట్టి తరలింపు జరుగుతుంది. రెవెన్యూ సిబ్బంది ఉదాసీన వైఖరి, అధికారుల నాయకుల అధికార బలంతో వందలాది టిప్పర్ల మట్టిని తరలించుకుపోతున్నారు. నియోజకవర్గంలో మట్టి అక్రమ రవాణా జరగటం లేదు. అని కారు కూతలు కూసిన ప్రబుద్ధులు ఇప్పుడు ఏం సమాధానం చెబుతారు. కుల నాయకులతో ప్రెస్ మీట్ పెట్టించి మళ్లీ కులాన్ని దూషిస్తారా? లేదా మేము మట్టి దొంగలమే అని ఒప్పుకుంటారా? గూడూరు మండలంలో మట్టి మాఫియా గ్యాంగ్ మొత్తం జోగి రమేష్ అనుచరులే. సామాన్యుడు గాని, రైతు గాని తన పంట పొలంలో ఒక ట్రాక్టర్ మట్టి తన ఇంటి కు తెచ్చుకోవాలంటే, తప్పకుండా ఈ మట్టి మాఫియా అయినా జోగి రమేష్ అనుచరులకు కప్పం కట్టవలసిందె. తక్షణమే స్పందించి ఎమ్మార్వో గాని, ఆర్డీవో గాని చర్యలు తీసుకోకపోతే జిల్లా కలెక్టర్ కి ఫిర్యాదు చేస్తామని పెడన జనసేన నాయకులు ఎస్.వి బాబు అన్నారు.