ముఖ్యమంత్రి తీరుమార్చుకోకపోతే ఉరుకునేదిలేదు: పితాని బాలకృష్ణ

కోనసీమ జిల్లా, ముమ్మిడివరం జనసేన పార్టీ కార్యాలయంలో మంగళవారం మృతిచెందిన కౌలు రైతులకుటుంబాలను ఆదుకునే నిమిత్తం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నిర్వహిస్తున్న యాత్రకు సంబంధించి టీం పిడికిలి రూపొందించిన పోస్టర్ ను పితాని బాలకృష్ణ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో గోదశి పుండరీష్, జక్కంశెట్టి బాలకృష్ట, దూడల స్వామి, కడలి వెంకటేశ్వరరావు, మల్లిపూడి రాజాతో పాటు జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బాలకృష్ణ విలేకర్లతో మాట్లాడారు. పిచ్చి పట్టి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నాడు. జనసేన రాష్ట్ర రాజకీయ వ్యవహరాల కమిటి సభ్యులు, ముమ్మిడివరం నియోజకవర్గ పార్టీ ఇన్ చార్జ్ పితాని బాలకృష్ణ. పవన్ కళ్యాణ్ తన కష్టార్జితాన్ని కష్టాలలో ఉన్న మృతి చెందిన కౌలురైతు కుటుంబాలకు పంచిపెడుతున్నారు. జగన్మోహన్ రెడ్డిలా దోచుకుని దాచుకోవడం లేదు. ప్రభుత్వ పతనం ఖాయమనే అర్థమయి భయంతోనే జగన్ పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నాడు. మంచి ట్రీట్మెంట్ చేయించుకుంటే మంచిది. ముఖ్యమంత్రి సభలకు జనాన్ని బయపెట్టి తరలిస్తున్నారు. అందుకే జగన్ ప్రసంగం మొదలపెట్టేసరికి ప్రజలు పారిపోతున్నారు. హమీలివ్వడంతప్ప ప్రజలకు చేసిందేమిలేదు. ఇక వైసిపి ఆటలు ముగిసాయి… ప్రభుత్వం నుండి ఆర్టీ యాక్టు ద్వారా మృతిచెందిన కౌలురైతుల వివరాలు తీసుకుని వారికుటుంబాలకు సాయం అందిస్తుంటే ప్రభుత్వ పరంగా ఆదుకోవడం మాని ముఖ్యమంత్రి జగన్ పవన్ కళ్యాణ్ ను విమర్శించడం దారుణమని తీరుమార్చుకోకపోతే ఉరుకునేదిలేదని పితాని బాలకృష్ణ హెచ్చరించారు.