ఘనంగా జనసేన పార్టీ ఉమ్మడి అనంతపురం జిల్లా మహిళా కార్యాలయ ప్రారంభోత్సవం

★అట్టహాసంగా జనసేన పార్టీ ఉమ్మడి అనంతపురం జిల్లా మహిళా కార్యాలయం ప్రారంభోత్సవం

★రాయలసీమ మహిళా విభాగం ప్రాంతీయ కమిటీ సభ్యురాలు శ్రీమతి పెండ్యాల శ్రీలత గారి ఆధ్వర్యంలో అనంతపురం జిల్లా వీర మహిళా విభాగం సమీక్షా సమావేశం

★శ్రీమతి పెండ్యాల శ్రీలత జిల్లా నాయకులు పెండ్యాల హరి గార్ల ఆధ్వర్యంలో పలువురు ముస్లిం మత పెద్దలు ఇతర పార్టీలకు చెందిన మహిళలు, యువత పెద్ద ఎత్తున జనసేన పార్టీలో చేరిక

రాయలసీమ మహిళా విభాగం ప్రాంతీయ కమిటీ సభ్యురాలు శ్రీమతి పెండ్యాల శ్రీలత నూతనంగా ఏర్పాటు చేసిన అనంతపురం జిల్లా మహిళా కార్యాలయాన్ని జిల్లా అధ్యక్షులు టి.సి వరుణ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి, రాష్ట్ర కార్యక్రమాల నిర్వహణ ప్రధాన కార్యదర్శి భవానీ రవికుమార్, రాయల సీమ మహిళా విభాగం ప్రాంతీయ కమిటీ సభ్యురాలు శ్రీమతి పసుపులేటి పద్మావతి నూతన మహిళా కార్యాలయాన్ని ప్రారంభించారు.

ప్రారంభోత్సవ అనంతరం శ్రీమతి పెండ్యాల శ్రీలత ఆధ్వర్యంలో వీర మహిళా సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రాయలసీమ మహిళా రీజినల్ కోఆర్డినేటర్లు పాల్గొని మహిళా సాధికారత, జనసేన పార్టీలో మహిళల పాత్ర, పార్టీ బలోపేతానికి వీర మహిళల కృషి వంటి పలు కీలక అంశాలపై చర్చించడం జరిగింది. ఈ సందర్భంగా పెండ్యాల శ్రీలత మాట్లాడుతూ.. ముందుగా మనం మహిళా సాధికారత గురించి చూసుకున్నట్లయితే మన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు నిత్యం మహిళల అభివృద్ధికి వారు ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా సమాజంలో గుర్తింపు పొందాలని ఎంతగానో కృషి చేస్తున్నారు. అందులో భాగంగా మహిళలు ఆర్థికంగా అభివృద్ధి సాధించాలని వ్యవసాయ రంగంలో పేద మహిళా రైతులతో మహిళా ప్రాంతీయ కమిటీ సభ్యులు మమేకమై వారితో లాభసాటి మరియు సేంద్రియ వ్యవసాయం చేపించి వారి ఆర్ధిక తోడ్పాటుకు కృషి చేయాలని మమ్మల్ని ఆదేశించారు. అందులో భాగంగానే మహిళల అభివృద్ధి కోసం మన రాష్ట్రంలో మొట్టమొదటి సారిగా మన అనంతపురం జిల్లా నార్పల మండలం గంగణ పల్లి గ్రామంలో దాదాపు పేద మహిళా రైతులను 12 మందిని గుర్తించి వారికి పదిహేను ఎకరాల బంజరు భూమిని కేటాయించి అరటి, ఇతర ఉద్యాన పంటలను పెట్టించి మహిళల ఆర్థిక తోడ్పాటుకు పాటు పడుతున్నామని తెలియజేస్తూ.. రాబోయే కాలంలో వెనుకబడిన మహిళల అభివృద్ధికి చిన్న, కుటీర పరిశ్రమలను స్తాపిస్తామని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాము.. మనం అధికారంలో లేకపోయినప్పటికీ పేద ప్రజల కోసం ఇటువంటి గొప్ప కార్యక్రమాలు చేస్తున్నామంటే అధికారంలోకి వచ్చాక ఆంధ్రప్రదేశ్ ను శ్రీ పవన్ కళ్యాణ్ గారి అధ్యక్షతన స్వర్ణాంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దుతామని తెలియజేశారు.

అదేవిధంగా జనసేన పార్టీ లో మహిళల పాత్ర గురించి:

జనసేన పార్టీలో మహిళలు పార్టీ ఆవిర్భావం నుంచి అంతర్భాగంగా ఉంటూ పార్టీ అభివృద్ధికి తోడ్పడుతూ అధికార పార్టీలో వైఫల్యాలను సమాజంలో ఎండగడుతూ జనసేన పార్టీ అభివృద్ధికి ఎంతగానో కృషి చేస్తున్నారు. రాబోయే కాలంలో మనం మరింతగా శ్రమించి వైసీపీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతూ.. మన పార్టీ సిద్ధాంతాలు, పవన్ కళ్యాణ్ గారు రైతు భరోసా యాత్ర ద్వారా మరణించిన 3000 కౌలు రైతుల కుటుంబాలకు ఒక్కో కుటుంబానికి లక్ష రూపాయల సహాయం, అప్పు లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ను తీర్చిదిద్దడానికి జనసేన పార్టీ షణ్ముఖ వ్యూహం వంటి గొప్ప విషయాలను ప్రతి పల్లె పల్లెకు, వాడ వాడకు తెలియజేసి మన అధినేత పవన్ కళ్యాణ్ గారిని 2024 లో ముఖ్యమంత్రిని చేసుకోవాలని తెలియజేశారు.

పార్టీ బలోపేతానికి వీర మహిళల కృషి:
జనసేన పార్టీ బలోపేతానికి మన వీర మహిళలు ప్రత్యేకంగా కృషి చేయాల్సి ఉంటుంది. అందులో భాగంగానే అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు మరియు రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ గారి సూచనల మేరకు త్వరలోనే జిల్లా కమిటీలు, నియోజకవర్గాల కమిటీలను నియమించుకొని పార్టీ అభివృద్ధికి మరింత ఊతం తెచ్చే విధంగా మనం కృషిచేయాలని తెలియజేశారు.

రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితులు:
ఇకపోతే మన రాష్ట్రం మరో శ్రీలంక మరో వెనుజులా దేశాల లాగా మారే ప్రమాదం ఉందని ఈ వైసీపీ చెత్త ప్రభుత్వం అనాలోచిత నిర్ణయాల వల్ల రాష్ట్రం అప్పుల ఊబిలోకి వెళ్ళిపోతుందని రాష్ట్రంలో నిరుద్యోగిత శాతం, పేదరికం శాతం పెరిగిపోతోందని దీనికితోడు వ్యవసాయ రంగాన్ని నీరుగార్చడానికి వ్యవసాయ రంగంలో ఉత్పత్తి, ఉత్పాదకతను తగ్గించడానికి కరెంట్ మోటార్లకు మీటర్లు పెట్టడం వైసీపీ ప్రభుత్వ నిరంకుశత్వానికి నిదర్శనమని అవి కరెంటు మీటర్లు కాదని రైతుల మెడలో ఉరితాళ్లని తెలియజేస్తున్నాము. అదేవిధంగా మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకంలో భాగంగా ఉపాధి కూలీలతో ఉదయం మరియు సాయంత్రం రెండు పూటలా పని చేయిస్తూ.. కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేసినప్పటికీ.. ఆ నిధులను పక్కదారి పట్టించి ఉపాధి కూలీలకు కూలీ ని చెల్లించకుండా మొండిచేయి చూపిస్తున్నాయని.. వైసీపీ ప్రభుత్వం దిక్కుమాలిన ప్రభుత్వమని దుయ్యబట్టారు. అదేవిధంగా ఈ చంచలగూడా దత్తపుత్రుడు మాట్లాడితే చాలు మా అధ్యక్షుల వారిని దత్తపుత్రుడు.. దత్తపుత్రుడు అంటున్నాడు. ఎవరు ఎవరికి దత్తపుత్రుడో 2024లో ఆంధ్రప్రదేశ్ ప్రజలే బలమైన తీర్పు ఇస్తారని తెలియజేస్తూ.. ఈ ముఖ్యమంత్రి విదేశాలకు వెళ్లాలంటే సీబీఐ కోర్టు అనుమతి తప్పనిసరి ఇటువంటి అవినీతి ముఖ్యమంత్రి మన రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండడం ఆంధ్రప్రదేశ్ ప్రజలు చేసుకున్న దౌర్భాగ్యం అని తెలియజేశారు.

మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు దాడుల గురించి:

ఇక పోతే రాష్ట్రంలో మహిళలపై అత్యాచారాలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. ఒక మహిళగా వార్తలు చూడాలంటేనే భయమేస్తోంది. రాష్ట్రంలో ఏ మహిళపై అఘాయిత్యం జరిగిందో అని వాటిని చూస్తేనే మనసు తరుక్కుపోతుందని.. ఒక్కొక్కసారి మనం నిరంకుశత్వ పాలనలో ఉన్నామా అనే సందేహం వస్తుందని మహిళలపై ఇన్ని దాడులు అత్యాచారాలు జరిగిన దోషులకు కఠినమైన శిక్షలు పడడం లేదని వైసీపీ ప్రభుత్వం శిక్షలను కఠినంగా అమలు చేసి ఉంటే రాష్ట్రంలో ఇటువంటి అఘాయిత్యాలు జరిగేవి కావని.. జనసేన పార్టీ అధికారంలోకి వస్తే మహిళల రక్షణ కోసం ప్రత్యేక చట్టాలు, ప్రత్యేక వ్యవస్థను తీసుకువచ్చే విధంగా కృషి చేస్తామని అంత వరకూ మహిళలు స్వీయ రక్షణ పెంపొందించుకోవాలని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నానన్నారు.

అనంతరం శ్రీమతి పెండ్యాల శ్రీలత, పెండ్యాల హరిల ఆధ్వర్యంలో అనంతపురం జిల్లా శింగనమల నియోజక వర్గం బుక్కరాయ సముద్రం మండలంలోని జనచైతన్య కాలనీకి చెందిన పలువురు ముస్లిం మత పెద్దలు, మహిళలు యువకులు ఇతర పార్టీల నుంచి పవన్ కళ్యాణ్ ఆశయాలు, మరణించిన కౌలు రైతుల కుటుంబాలకు లక్ష రూపాయల ఆర్థిక సహాయం, ముస్లింల అభివృద్ధికి సచార్ కమిటీ విధానాలు, అప్పు లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ తీర్చిదిద్దడానికి షణ్ముఖ వ్యూహం వంటి పవన్ కళ్యాణ్ గారి గొప్ప ఆలోచన విధానాలను చూసి జనసేన పార్టీలోకి చేరడం జరిగింది.

ఈ కార్యక్రమాలలో జిల్లా అధ్యక్షులు టి.సి వరుణ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిళకం మధుసూదన్ రెడ్డి, రాష్ట్ర కార్యక్రమాల నిర్వహణ ప్రధాన కార్యదర్శి భవాని రవి కుమార్, రాయలసీమ ప్రాంతీయ కమిటీ సభ్యులు శ్రీమతి పసుపులేటి పద్మావతి, ఆకుల వనజ, హసీనా బేగం, సభాధ్యక్షురాలు కాశెట్టి సావిత్రి, జిల్లా లీగల్ సెల్ అధ్యక్షులు మురళి, జిల్లా ఉపాధ్యక్షులు జయారామిరెడ్డి, నగర అధ్యక్షులు బాబు రావు, రాయదుర్గం ఇంచార్జ్ మంజునాథ గౌడ్, రాప్తాడు ఇంచార్జ్ సాకే పవన్, జిల్లా కార్యదర్శులు కాశెట్టి సంజీవరాయుడు, చొప్పా చంద్రశేఖర్, రాపా ధనుంజయ, అవుకు విజయ్, కోన చంద్ర శేఖర్, నగర ప్రధాన కార్యదర్శి పెండ్యాల చక్రపాణి, ఎంపీటీసీ అమర్ కార్తికేయ, వీర మహిళలు, నగర కమిటీ సభ్యులు, మండలాల అధ్యక్షులు, కార్యక్రమాల నిర్వహణ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొనడం జరిగింది.