చిన్న గొల్లపాలెం రోడ్డు పనుల్లో భారీ అక్రమాలు

పెడన నియోజకవర్గం, కృత్తివెన్ను మండలం, చిన్న గొల్లపాలెం రోడ్డు అధ్వానంగా ఉంది. ఈ రోడ్డు మరమ్మతులు కోసం కోట్ల రూపాయల నిధులతో పనులు మంజూరు చేసుకుని, లక్షల రూపాయలతో పైపై మెరుగులు దిద్ది, భారీ స్థాయిలో అక్రమాలకు పాల్పడ్డారు. స్థానిక ఎమ్మెల్యే ముఖ్య అనుచరుడు వసూల్ రాజా ఈ కాంట్రాక్టును దక్కించుకున్నట్లు సమాచారం. మంత్రి ఆఫీసులో నెంబర్ టు గా చలామణి అయ్యే ఈయన మంత్రిగారికి బంధువు కూడా అంట. ఈ వసూల్ రాజా అధికారం ఎక్కడ ఉంటే అక్కడ ప్రత్యక్షమవుతాడు. త్వరలోనే టెండర్ మొత్తం ఎంత?. క్షేత్ర స్థాయిలో జరిగిన పని ఎంత అనే విషయాన్ని ఆధారాలతో సహా బయట పెడతాం. ఈ విషయంపై చర్చించడానికి మీరు సిద్ధమా? నియోజకవర్గంలో ఒక గ్రామంలోనే ఇంత అవినీతి జరుగుతుంటే, పెడన నియోజకవర్గంలోని 88 పంచాయతీల్లో 125 గ్రామాల్లో ఎంత అవినీతి జరిగి ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. గడపగడపకు అంటూ హడావుడి చేయడం తప్ప వైసిపి ప్రభుత్వం చేసింది ఏమీ లేదు. ఇప్పుడు మనకు కావాల్సింది పల్లెనిద్ర కాదు. పల్లె వెలుగని పెడన నియోజకవర్గ జనసేన నాయకులు ఎస్ వి బాబు అన్నారు.