కీమ్మి గ్రామంలో గర్భాన పర్యటన

పాలకొండ నియోజకవర్గం, వీరఘట్టం మండలం, కీమ్మి గ్రామంలో జనసేన నాయకులు గర్భాన సత్తిబాబు పర్యటించారు. ఈ సందర్భంగా రైతులను కలిసి పవన్ కళ్యాణ్ చేపట్టిన రైతు భరోసా యాత్రలో బాగంగా 3000 మంది కౌలు రైతులు చనిపోయారని, వాళ్ల కుటుంబాలను నేరుగా పరామర్శించి ఒక్కో కుటుంబానికి లక్ష రూపాయలు విరాళం ప్రకటించారు. అలాంటి నాయకుడిని కాపాడు కోవాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. అలాగే వివిధ విషయాలు గురించి వివరించి వాళ్లకు అవగాహన కల్పించారు. అలాగే వృద్ధులతో మాట్లాడుతూ.. సామాన్యులకు న్యాయం జరగాలంటే, పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలని అన్నారు. అలాగే జనసేన ఎన్నికల గుర్తు గాజు గ్లాసు అని ఆయన అన్నారు. గాజు గ్లాస్ గుర్తుకే ఓటు వేసి భావితరాల భవిష్యత్ కు శ్రీకారం చుట్టాలని ప్రజలకు వృద్ధులకు యువతకు ఆయన హితవు పలికారు. ఈ కార్యక్రమంలో జనసెన నాయకులు మరియు జనసైనికులు పాల్గొన్నారు.