గోపి కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకోవాలి: యుగంధర్ పొన్న

*ప్రభుత్వం ప్రేత్యేక చర్యలు చేపట్టాలి

*నిర్మాణంలో ఉన్న ఇంటిని ప్రభుత్వమే నిర్మించి ఇవ్వాలి

*ప్రజా సంఘాలు, స్వచ్చంద సంస్థలు సాయమందించాలి

*ఆపదలో ఉన్న కుటుంబాన్ని ఆడుకుందాం రండి

*ప్రేత్యేక పిలుపు నిచ్చిన జనసేన నేత యుగంధర్ పొన్న

చిత్తూరు జిల్లా, గంగాధర నెల్లూరు నియోజకవర్గం, కార్వేటినగరం మండలం యం. యం. విలాసం పంచాయతీ కనకమ్మ కండ్రిగ గ్రామం కె. మునస్వామి మండది కుమారుడు కె. గోపి పూరిల్లు విద్యుత్ షాట్ సర్కూట్ కారణంగా.. దగ్ధం అయింది. విషయం తెలుసుకొన్న జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి యుగంధర్ పొన్న బాధిత కుటుంబాన్ని జ పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సుమారు 4 లక్షల ఆస్తి నష్టం జరిగినట్లు కుటుంబ సభ్యులు తెలపడం పట్ల ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఈ కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకోవాలని, నవరత్నాలు పేదలందరికీ ఇళ్ల పథకంలో లబ్ధిదారులైన ఈ కుటుంబానికి ప్రభుత్వమే ఆర్థిక సహాయం చేసి ఆ ఇంటి నిర్మాణం పూర్తయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని.. సంబంధిత అధికారులను విజ్ఞప్తి చేస్తున్నానన్నారు. జనసేన పార్టీ తరఫున కూడా ఈ కుటుంబానికి సహాయం చేస్తామని హామీ ఇచ్చారు. మండల అధికారుల స్పందనకు అభినందనలు తెలిపారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజా సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు, అన్ని రాజకీయ పార్టీలు ఇలాంటి కుటుంబాలకు ఆదరణగా నిలవాలని, అన్ని విధాల ఆదుకోవాలని, తమ వంతు సహాయం వారికి అందించాలని ప్రత్యేకంగా పిలుపునిచ్చారు. కట్టుబట్టలతో మిగిలిపోయిన కుటుంబాన్ని ఆదుకోవాలని తెలిపారు. మానవ సేవే మాధవ సేవని, ఇబ్బందుల్లో ఉన్న వారిపట్ల ఆపన్న హస్తం అందించాల్సిన ఆవశ్యకత ఉందని.. ఈ సందర్భంగా తెలిపారు. రండి ఆపదలో ఉన్న కుటుంబాన్ని ఆదుకుందాం అని పిలుపునిచ్చారు. దాతలు ఎవరైనా ముందుకు వచ్చి వంట సామాగ్రి, బట్టలు, గ్యాస్ స్టవ్, సిలిండర్, ఇత్యాది వస్తువులు ఇవ్వడానికి ముందుకు రావాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో జిల్లా సంయుక్త కార్యదర్శి రాఘవ, జనసైనికులు, స్థానికులు ఉన్నారు.