ప్రయాణికుల దాహార్తిని తీరుస్తున్న జనసైనికులకు అభినందనలు: రామ్ సుధీర్

నిస్వార్థ జనసైనికులు జనసేన పార్టీ కోసం నిరంతరం కస్టపడి పని చేస్తూ.. ఎవరెన్ని ఇబ్బందులకు గురి చేసినా వెనుకడుగు వేయకుండా పదవుల కోసం కాదు.. పవన్ కళ్యాణ్ గారి ఆశయ సాధన కోసం అంటూ.. జనసేన పార్టీ గెలుపే లక్ష్యంగా పనిచేస్తున్న ఇంటి కిరణ్, ఎలుబండి కృష్ణ, కాజ మణికంఠ, నక్క సురేష్, కొప్పినేని రవీంద్ర మరియు లక్ష్మీపురం జనసైనికులు అంతా కలసి జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ సేవా స్ఫూర్తితో.. శ్రీమతి డొక్కా సీతమ్మ గారి ఆశీస్సులతో కృత్తివెన్ను మండలం, లక్ష్మీపురం గ్రామంలో 01/05/2022 తేదీన మజ్జిగ చలివేంద్రం ప్రారంభించి.. గత 21 రోజులుగా నిరంతరం మజ్జిగను అందిస్తూ.. ప్రతీ రోజూ ఎన్.హెచ్ 216 పై ప్రయాణించే కొన్ని వందల మంది ప్రయాణికులు దాహార్తిని తీరుస్తున్నారు.. ఈ సందర్భంగా వారికి పెడన నియోజక వర్గం జనసేన పార్టీ నాయకులు యడ్లపల్లి రామ్ సుధీర్ అభినందనలు తెలియజేశారు. మీరు ఇలాంటి సేవా కార్యక్రమాలు మరెన్నో చేస్తూ జనసేన పార్టీని ప్రజల్లోకి మరింత చేరువ చేయాలని రామ్ సుధీర్ కోరారు.