కులాల మధ్య చిచ్చుపెట్టి అల్లర్లను సృష్టించారు

*పత్రికా సమావేశంలో భోగిరెడ్డి కొండబాబు

కాకినాడ రూరల్ కరప మండలం జనసేన పార్టీ తరఫున కరప మండల సీనియర్ నాయకులు భోగిరెడ్డి కొండబాబు ఆధ్వర్యంలో పత్రికా సమావేశం నిర్వహించడం జరిగింది. కొండబాబు పత్రికా సమావేశంలో మాట్లాడుతూ ముఖ్యంగా వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు దళితుడైన తన డ్రైవర్ సుబ్రహ్మణ్యంని అతి కిరాతకంగా హత్య చేసి దానిని కప్పి పుచ్చడానికి దుర్మార్గపు ఆలోచనతో వైసీపీ ప్రభుత్వం అమలాపురంలో కులాల మధ్య చిచ్చుపెట్టి అల్లర్లను సృష్టించారు. ఎక్కడైనా ఏదైనా అగ్ని ప్రమాదం జరిగినప్పుడు వెంటనే ఫైర్ ఇంజన్ గంట సమయంలో వస్తుంది కానీ మంత్రి ఇల్లు దహనం అయితే పూర్తిగా కాలి బూడిద అయినా ఫైర్ ఇంజన్ అక్కడ కనిపించలేదు. దీన్నిబట్టి అర్థం అవుతుంది. కుల రాజకీయాలు రెచ్చగొట్టి పార్టీ ఈ వైసిపి ప్రభుత్వం అని. ఈ విధంగా ఉదయం నుండి అల్లర్లు జరుగుతాయని ఇంటిలిజెన్స్ సమాచారం ఉండి కూడా స్పెషల్ ఫోర్స్ ను అల్లర్లను అదుపు చేయడానికి ఎక్కడ కూడా పోర్స్ ను ఉపయోగించలేదు. కేవలం వైసీపీ ప్రభుత్వం జనసేన పార్టీ అల్లర్లను సృష్టిస్తుందని జనసేన పార్టీ మీద తప్పుడు ప్రచారాలు చేస్తున్న వైసీపీ నాయకులు. ఈరోజు జనసేన పార్టీ సిద్ధాంతాలను కులాలని కలిపే ఆలోచన విధానం ఉన్న పార్టీ జనసేన పార్టీ. బ్రిటిష్ వారిపై రెండు వందల సంవత్సరాల పోరాటం తర్వాత లభించిన స్వతంత్రాన్ని ఈ దేశంలో పుట్టిన ప్రతి పౌరుడు కి అందేవిధంగా స్వతంత్ర యోధుల కష్టాన్ని వృధా కానివ్వకుండా ప్రపంచంలో అతి పెద్ద లిఖిత పూర్వక రాజ్యాంగాన్ని రచించిన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ పేరును అమలాపురం జిల్లాకి పెట్టాలని మొట్టమొదట జనసేన పార్టీ ఇన్చార్జి శెట్టిబత్తుల రాజబాబు జనసేన పార్టీ తరఫున ఒక మెమోరాండం ప్రభుత్వానికి అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి భోగి రెడ్డి గంగాధర్, మండల ఉపాధ్యక్షులు సుందర సత్తిబాబు, సైనావరపు భవాని శంకర్, కరప మండల అధ్యక్షులు పేకేటి దుర్గా ప్రసాద్, గురజనాపల్లి గ్రామ అధ్యక్షులు సింగిరెడ్డి సత్తిబాబు, యలవలపల్లి పల్లి శర్మ, నున్న గణేష్ నాయుడు, శాఖ శ్రీనివాస్, తాళ్లూరి కాంత రాజు రెడ్డి లావరాజు, మణికంఠ, మల్లేశ్వరరావు, శాఖ వంశి, ఎడ్ల శ్రీను పెంటపాటి సుబ్రహ్మణ్యం, ఎలుగుబంట్లు గంగాధర్, శ్రీమన్నారాయణ తదితరులు హాజరయ్యారు.