కోనసీమ అల్లర్లు వెనుక వైసీపీ కుట్ర: వేగుళ్ళ లీలాకృష్ణ

*కులాల మధ్య చిచ్చు
*అమాయకలైన కాపులను కేసుల్లో ఇరికిస్తున్నారు
*ఘటనపై న్యాయ విచారణ చేయాలి
*మండపేట నియోజకవర్గ జనసేనపార్టీ ఇంచార్జ్ వేగుళ్ళ లీలాకృష్ణ డిమాండ్

మండపేట: పచ్చని కోనసీమలో కులాల మధ్య చిచ్చు పెట్టి రాజకీయ లబ్ది పొందాలని వైసీపీ ప్రభుత్వం చూస్తోందని మండపేట నియోజకవర్గ జనసేనపార్టీ ఇంచార్జ్ వేగుళ్ళ లీలాకృష్ణ విమర్శించారు. ఈ సందర్భంగా ఆయన శనివారం మీడియాతో మాట్లాడుతూ.. అమలాపురంలో జరిగిన ఘటన చాలా దురదృష్టకరమని అన్నారు. ఘటన మీద విచారణ జరపకుండా ఉద్దేశపూర్వకంగానే హోంమంత్రి జనసేన మీద నిందలు మోపుతున్నారని ఆరోపించారు. న్యాయ విచారణ చేయాలని డిమాండ్ చేశారు. చేయని పక్షంలో ఆందోళనకు సిద్ధమని స్పష్టం చేశారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని, కులాలను రెచ్చగొట్టే వ్యాఖ్యలు సరికాదని చెప్పారు. వైసీపీ మూడేళ్ల పాలనలో ఎస్సీ, ఎస్టీల మీద ఉన్న ప్రేమ ఏ పాటిదో అర్ధం అయ్యిందన్నారు. ఒక్క ఛాన్స్ ఇచ్చినందుకు వైసీపీ రాష్ట్రంలో విధ్వంసం సృష్టిస్తోందన్నారు. వైసీపీ పాలనలో అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ప్రజల నుంచి వచ్చే వ్యతిరేకతను తప్పించుకునేందుకు ఎప్పటికప్పుడు ముఖ్యమంత్రి తన సలహాదారులతో కలసి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని చెప్పారు. జిల్లాల విభజన, పేర్లు పెట్టే అంశం కూడా సమస్యల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు తెరమీదకు తెచ్చారని ఎద్దేవా చేశారు. మా అధినేత పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్లు దళిత నాయకులు పేర్లు జిల్లాలకు పెట్టాలని, కోనసీమ జిల్లాకు అంబేద్కర్ పేరు పెట్టాలని ఆనాడు మేమందరం ఏకాభిప్రాయంతో అభివించిన విషయాన్ని గుర్తు చేశారు. అంబేద్కర్ ఏ ఒక్క కులానికి, మతానికి, ప్రాంతానికి నాయకుడు కాదని ఎవత్ భారత జాతికి పెద్ద దిక్కుగా ఉండి దేశ రాజ్యాంగాన్ని రూపొందించారని పేర్కొన్నారు. బడుగు బలహీన వర్గాల కోసం ఆయన పాటు పడ్డారని అలాంటి నేత పేరు కోనసీమకు ఏర్పాటు చేయడం ఈ ప్రాంతవాసులకు గర్వకారణమని పేర్కొన్నారు. కోనసీమ ప్రాంతంలో జనసేన బలపడడాన్ని చూసి తట్టుకోలేకే అల్లర్లను మా పార్టీ మీదకు రుద్దాలని చూస్తున్నారు. మీ అరాచకాలకు చరమగీతం పాడే రోజులు దగ్గర పడ్డాయి. నోరు అదుపులో పెట్టుకోకుంటే అందుకు తగ్గ సమాధానం చెప్పేందుకు మేము సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఎవరెన్ని కుట్రలు చేసినా 2024లో జనసేన పార్టీ అధికారంలోకి రాబోతోందని, పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి కాబోతున్నారని లీలాకృష్ణ స్పష్టం చేశారు.