గొంది ప్రజల దాహార్తికి జనసేన వాటర్ ట్యాంకర్

కోనసీమ జిల్లా, రాజోలు వేసవి కాలంలో నీటి ఎద్దడికి ప్రజలు ఇబ్బంది పడుతుండడంతో జనసేనపార్టీ చిరుపవన్ సేవాసమితి ఆద్వర్యంలో ప్రతిరోజు ప్రజలకు మంచినీళ్ళు అందేవిధంగా వాటర్ ట్యాంకర్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ వాటర్ ట్యాంక్ ద్వారా బుధవారం గొంది గ్రామంలో మూలగొంది ప్రాంతములలో నీరు అందక ఇబ్బందులు పడుతున్నవారికి జనసేన నాయకులు వీరా వేంకన్నబాబు ట్రాక్టర్ డిజల్ కి ఆర్ధిక సహకారం అందించగా గొంది జనసైనికుల ద్వారా త్రాగునీరు అందించడం జరిగిందని జనసేన నాయకులు నామన నాగభూషణం అన్నారు. ఈ కార్యక్రమంలో గొంది జనసైనికులు పాల్గొనడం జరిగింది.