UPసర్కార్ నిర్ణయాన్ని స్వాగతించిన జనసేన

హథ్రాస్ ఉదంతాన్ని సీబీఐకి అప్పగించడాన్ని జనసేన పార్టీ స్వాగతించింది. ఈ కేసును సీబీఐకి అప్పగించడం ద్వారా సీఎం యోగి ఆదిత్యనాథ్ సరైన నిర్ణయం తీసుకున్నారని ఓ ప్రకటనలో అభిప్రాయపడింది. ఈ కేసులో సీబీఐ విచారణ ద్వారా దోషులకు శిక్ష పడుతుందని జనసేన నమ్ముతోందని ఆ ప్రకటనలో పార్టీ అగ్రనేత నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు.

అత్యాచార ఘటనలు జరిగినప్పుడు కుల, మత, ప్రాంతాలకు అతీతంగా అందరూ గళం విప్పాలని జనసేన ఆది నుంచి కోరుకుంటోందని తెలిపారు. అమ్మాయిల భద్రతకు ఈ సమాజం భరోసా ఇవ్వాల్సి ఉందని పేర్కొన్నారు. ఏపీలోని కర్నూలుకు చెందిన సుగాలి ప్రీతి అనే బాలిక వ్యవహారంలో జనసేన ఇదే తరహాలో పోరాడుతోందని వివరించారు. పేర్కొన్నారు.

నాడు కర్నూలులో జనసేనాని పవన్ కల్యాణ్ కవాతు చేయడంతో ప్రభుత్వం ఆ కేసును సీబీఐకి అప్పగించిందని, అయితే ఇంతవరకు సీబీఐ నుంచి ఈ కేసుపై అధికారిక ప్రకటన లేదని తెలిపారు.