వడ్లతురకపల్లి గ్రామ సమస్యలను తక్షణమే పరిష్కరించాలి: జనసేన డిమాండ్!

అన్నమయ్య జిల్లా, టి. సుండుపల్లి మండలంలోని పొలిమేరపల్లి గ్రామపంచాయతీ పరిధిలో ఉన్న వడ్లతురకపల్లి లో ఉన్నటువంటి ప్రధాన సమస్యలు షేక్ అక్తర్ ఉన్నిశా, వారి భర్త జబ్బార్ దంపతులు ఇదే ఊరిలో 15 సం. నుంచి కాపురం ఉంటున్నారు వారికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. కనీసం వాళ్ళకి సొంత ఇంటి స్థలం కానీ.. గృహం కానీ లేని దీన పరిస్థితి లో ఉన్నారు. ప్రస్తుతానికి వేరే వారి ఇంట్లో జీవనం సాగిస్తున్నారు. ప్రభుత్వ అధికారులు స్పందించి ఇంటి స్థలం పక్కా ఇళ్లు మంజూరు చేయవసిందిగా ఆ కుటుంభం విన్నవించుకుంటుంది. అదేవిధంగా ఆ గ్రామంలో త్రాగునీటి సమస్య తీవ్రంగా ఉంది. గత పది సంవత్సరాల క్రితం ప్రభుత్వం వారు మంజూరు చేసినటువంటి పక్కా ఇండ్లు నిర్మించుకున్నారు. అయితే అవి నిర్మాణాలు జరిగినప్పుడు నాణ్యత లేకపోవడం వల్ల వర్షాలు కురిసినప్పుడు వర్షపు నీరు సీలింగ్ లో లీక్ అవుతూ ఇండ్లల్లో నివసిస్తున్న నివాసితులు చాలా రకాలుగా సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఈ గ్రామంలో సీసీ రోడ్లు కానీ, వీధి దీపాలు కానీ లేవు కావున ప్రభుత్వ అధికారులు తక్షణమే పరిశీలించి గ్రామస్తులకు తగు న్యాయం చేయవలసిందిగా జనసేన పార్టీ తరపున డిమాండ్ చేయడం జరిగింది.