నిరాశ్రయులైన పేద కుటుంబానికి అండగా జనసేన పార్టీ

*బాధిత కుటుంబానికి పరామర్శ
*జనసేనపార్టీ ఆధ్వర్యంలో రూ.10 వేలు ఆర్థిక సాయం అందజేసిన జనసేన పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు బొలియశెట్టి శ్రీకాంత్

కొండపల్లి మున్సిపాలిటీ: వారం రోజుల క్రితం ఈదురు గాలి.. భారీ వర్షం ప్రభావానికి నిరాశ్రయులైన పేద కుటుంబానికి జనసేన పార్టీ నేతలు అండగా నిలిచారు. కొండపల్లి పట్టణ పరిధిలోని శాంతినగర్ ఇందిరమ్మ కాలనీలో ఇటీవల భారీ వర్షం ఈదురు గాలికి ఇంటిపైన రేకులు పూర్తిగా విరిగిపోయాయి. దీంతో ఆ కుటుంబం నిరాశ్రయులైంది. విషయం తెలుసుకున్న జనసేన పార్టీ నాయకులు బొలియశెట్టి శ్రీకాంత్ శుక్రవారం ఇందిరమ్మ కాలనీకి వెళ్లి బుజ్జమ్మ కుటుంబాన్ని పరామర్శించి.. జనసేన పార్టీ తరుపున తన వంతు రూ.10 వేలు ఆర్థిక సాయం అందజేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. ప్రజలు కష్టాల్లో ఉంటే ఆదుకునేది జనసేన పార్టీ మాత్రమేనన్నారు. బాధిత కుటుంబానికి జనసేన పార్టీ అండగా ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు వై నాగేశ్వరరావు, పులిపాక ప్రకాష్, బత్తిన శ్రీనివాసరావు, చెన్నం శెట్టి కోటేశ్వరరావు, రామంజి, సురేష్, జగదీష్, రమేష్, వీర మహిళలు బొలియశెట్టి విజయ దుర్గ, హేమలత, రాణి, జనసేన పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.