జనసేన పార్టీ బలోపేతానికి చిరంజీవి యువత మరింత కృషి చేస్తుంది: త్యాడ రామకృష్ణారావు

*కొణిదెల నాగబాబు ను సత్కరించుకున్న విజయనగరం జిల్లా చిరంజీవి యువత, జనసేన నాయకులు

విజయనగరం: విజయనగరం జిల్లా చిరంజీవి యవత అధ్యక్షులు, జనసేన పార్టీ సీనియర్ నాయకులు త్యాడ రామకృష్ణారావు (బాలు) ఆధ్వర్యంలో ఉత్తరాంధ్ర పర్యటనలో భాగంగా విజయనగరం విచ్చేసిన జనసేన పార్టీ పొలిటికల్ ఏఫైర్స్ కమిటీ సభ్యులు, అఖిల భారత చిరంజీవి యువత గౌరవ అధ్యక్షులు కొణిదెల నాగబాబును శుక్రవారం ఎస్. వి. ఎన్ లేక్ ప్యాలెస్ లో జరిగిన సమావేశంలో సత్కరించు కోవటం జరిగింది. ఈ సందర్భంగా జనసేన పార్టీ సీనియర్ నాయకులు బాలు మాట్లాడుతూ.. ఉత్తరాంధ్రాలో పార్టీని మరింత పటిష్టపరిచేందుకు నాగబాబు పర్యటన చేశారని.. విజయనగరంలో మెగాభిమానులంతా జనసేన పార్టీని అనేక ప్రజాకార్యక్రమాలతో ముందుకు తీసుకెళ్ళామని.. ముందుముందు మరింత పార్టీ బలోపేతానికి మెగాభిమానులంతా ఓ బాధ్యత తీసుకుంటామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో జిల్లా చిరంజీవి యువత, జనసేన పార్టీ సీనియర్ నాయకులు పిడుగు సతీష్, ఎస్. మురళీమోహన్, మిడతాన రవికుమార్, కొయ్యాన లక్ష్మణ్ యాదవ్, చెల్లూరి ముత్యాల నాయుడు, లోపింటి కళ్యాణ్, యంటి రాజేష్, సలీం, శివ, సాయి, పళ్లెం కుమార స్వామి, కారి రాజేష్, తదితరులు పాల్గొన్నారు.