మదనపల్లి శుద్ధి నీటి నిర్మాణ అనుబంధంగా ఉన్న పనులు పూర్తి అయ్యేదెపుడు…?

మదనపల్లి, రాష్ట్ర ప్రభుత్వం జలాశయాలు నిర్మించి తాగేందుకు సిద్ది నీటిని అందజేస్తారని మదనపల్లి పట్టణ ప్రజలు మొదట్లో సంతోషించారు. వారి కోరిక సాకారం అయ్యేవిధంగా హడావిడిగా పనులు వేగవంతం చేసి సింహభాగం పనులు పూర్తి చేసినప్పటికీ చిన్న చిన్న పనులు పూర్తి చేయడంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. నీటి యూనిట్లో నిర్మాణ పనులు పూర్తి అయినప్పటికీ దీనికి అనుసంధానంగా ఉన్న పనులు పూర్తయితేనే శుద్ధి నీటిని ప్రజలకు సరఫరా చేయడానికి అవకాశం ఉంటుంది. అయితే ఈ పనులు పూర్తి చేయడంలో జాప్యం జరుగుతుంది. దీనివల్ల ప్రజలు ప్రైవేట్ నీటి వ్యాపారుల వద్ద నుండి శుద్ది నీటిని కొనుగోలు చేయాల్సి వస్తోంది. పట్టణ ప్రజల దాహార్తిని తీర్చడానికి 2004 సంవత్సరం ఫిబ్రవరి 28వ తేదీన అప్పటి రాష్ట్ర మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి 1074.50 లక్షల అంచనా వ్యయంతో సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులు నిర్మాణం చేపట్టడానికి శిలాఫలకం వేశారు. 2005లో పురపాలక సాధారణ ఎన్నికల్లో అప్పటి ముఖ్యమంత్రి రాజశేఖర్రెడ్డి పట్టణ ప్రజల దాహార్తిని తీర్చడానికి రెండు ససమ్మర్ స్టోరేజ్ ట్యాంకుల నిర్మాణానికి అనుమతి ఇచ్చారు ట్యాంకుల నిర్మాణం, భూసేకరణ, పైపులైన్లు నిర్మాణం తదితర వాటికి 138 వ్యయంతో ప్రభుత్వం నిర్మాణానికి అనుమతి మంజూరు చేసింది. ప్రజారోగ్య శాఖ ఆధ్వర్యంలో 55 కోట్లు ఖర్చుపెట్టి పైప్ లైన్ల నిర్మాణం పనులు పూర్తి చేశారు. అయితే వేసవి జలాశయాల నిర్మాణం పనులు అసంపూర్తిగా ఉన్నాయి. జలాశయాల పనులు ప్రజారోగ్య శాఖ ఆధ్వర్యంలో జరగాల్సి ఉండగా హెచ్ ఎన్ఎస్ ఎస్ అధికారులు చేపట్టారు. పట్టణంలో ఒక లక్షా ఎనభై వేల మంది జనాభా ఉన్నారు. పురపాలక సంఘం రోజుకు 12.5 ఎం.ఎల్.డి నీటిని అందజేయాల్సి ఉంది .అయితే 2.0 ఎం.ఎల్.డి నీటిని మాత్రమే అందజేస్తోంది ఈ నీరు తాగడానికి ఉపయోగ పడకపోవడంతో ప్రజలు ప్రైవేటు వ్యాపారుల వద్ద నుండి కొనుగోలు చేసుకుంటున్నారు. పట్టణ ప్రాంతంలో నివాసం ఉంటున్న అన్ని వర్గాల ప్రజలు నేడు తప్పనిసరిగా శుద్ధి నీటిని తాగుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రైవేట్ నీటి వ్యాపారం ఊపందుకున్నది. రోజుకి పట్టణంలో 10 లక్షల నుండి 15 లక్షల వరకు నీటి వ్యాపారం జరుగుతున్నట్లు అంచనా .పురపాలక సంఘం నీటి శుద్ధి కేంద్రాల ద్వారా తాగునీరు ను అందజేస్తే పేద ప్రజలు సుద్ధి నీటిని కొనుగోలు చేసే అవసరం ఉండదు. కనుక ప్రజారోగ్య శాఖ వారు వెంటనే వేసవి జలాశయం పెండింగ్ పనులు పూర్తి చేయడానికి చర్యలు తీసుకోవాలి.ఇన్టేక్ వెల్ నిర్మాణ పనులతోపాటు జలాశయంలో మూరవ పనులు కొన్ని పెండింగ్ ఉన్నాయి. ప్రభుత్వానికి నివేదిక పంపి త్వరితగతిన పూర్తి చేయించి వినియోగంలోకి తీసుకొని రావాలని జనసేన పార్టీ తరపున డిమాండ్ చేస్తూన్నామని చిత్తూరు జిల్లా కార్యదర్శి దారం అనిత అన్నారు.