నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పించాలి: దారం అనిత

మదనపల్లె, అర్హత కలిగిన ప్రతి నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు ఇవ్వాలని చిత్తూరు జిల్లా కార్యదర్శి దారం అనిత డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం పూర్తిస్థాయిలో జాబ్ క్యాలెండర్ ప్రకారం నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలని.. జిల్లాల వారీగా బ్యాక్ లాగ్ పోస్టుల భర్తీ వివరాలను ప్రకటించి.. భర్తీ చేయాలని.. కారుణ్య నియామకాలు వెంటనే ఇవ్వాలని.. రాష్ట్రంలో ఎక్కువగా పరిశ్రమలు పెట్టుబడులు తీసుకువచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని.. చదువుకున్న విద్యార్థులకు సరైన ఉపాధి అవకాశాలు లేకపోవడంతో తప్పుదోవ పడుతున్నారని.. దీనికి పూర్తి కారణం ప్రభుత్వము ఉద్యోగ అవకాశాలు కనిపించకపోవడమే.. వెంటనే స్పందించి నిరుద్యోగులను ఆదుకోవాల్సిందిగా జనసేన పార్టీ తరపున దారం అనిత డిమాండ్ చేశారు.