ఈ నెల 8వ ఏపీ విద్యార్థులకు ‘జగనన్న విద్యా కానుక’

ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ నెల 8వ తేదీన కంకిపాడులోని జెడ్పీ పాఠశాలలో ‘జగనన్న విద్యా కానుక’ పధకాన్ని ప్రారంభిస్తారని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ వెల్లడించారు. ఈ పధకం ద్వారా 43 లక్షల మంది విద్యార్థులకు లబ్ది చేకూరుతుందని చెప్పారు. దీని కోసం సుమారుగా రూ. 650 కోట్లు ఖర్చు చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు. విద్యారంగంలో సంస్కరణలను అమలు చేసి.. ప్రభుత్వ విద్యను బలోపేతం చేస్తున్నామని మంత్రి సురేష్ చెప్పుకొచ్చారు. విద్యా కానుక కింద విద్యార్థులకు ఇచ్చే కిట్‌లో.. పుస్తకాలు, బ్యాగ్, షూస్, సాక్స్, స్కూల్ డ్రెస్ మొదలగునవి ఉంటాయన్నారు.

అలాగే కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలకు అనుగుణంగా నవంబర్ 2 నుంచి రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలలను ప్రారంభించేందుకు చర్యలు చేపడతామని మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. కోవిడ్ రూల్స్ పాటిస్తూ స్కూల్స్ ప్రారంభిస్తామని.. దీని కోసం పకడ్బందీగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామన్నారు.