విద్యా వ్యవస్థ గాడి తప్పే విధంగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తుంది: రెడ్డి అప్పలనాయుడు

ఏలూరు: రాష్ట్రంలో ప్రతి ఏటా నాడు-నేడు కార్యక్రమం అట్టహాసంగా జరిపించి 10వ తరగతి విద్యార్థుల భవిష్యతో రాజకీయం చేస్తున్నారని ప.గో జిల్లా జనసేన పార్టీ అధికార ప్రతినిధి, ఏలూరు నియోజకవర్గ ఇంచార్జి రెడ్డి అప్పలనాయుడు మండిపడ్డారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దాదాపు 2లక్షల 60వేల మంది విద్యార్థులను ఫెయిల్ చేసిన ఈ ఘనత మీకే చెందింది.. గత 30 ఏళ్లలో 10వ తరగతి పాస్ గ్రాఫ్ పడిపోవడం ఇదే తొలిసారి అని అప్పలనాయుడు ప్రభుత్వం పై విమర్శలు చేసారు. అమ్మవడి పధకానికి డబ్బులు లేక ఇలా విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్నారు అని వ్యాఖ్యానించారు.

10వ తరగతి పరీక్ష పత్రం లీక్ అయిందని తెగ హడావుడి చేశారు..నిజంగా ప్రశ్నాపత్రం లీక్ అయి ఉంటే వందకి 100% విద్యార్థులు పాస్ అవ్వాలి కదా రెండు లక్షల అరవై వేలు ఎలా ఫెయిల్ అయ్యారని ప్రశ్నించారు. ప్రతి విద్యార్థికి పది మార్కులు వేసి పాస్ చేయాలని జనసేన పార్టీ నియోజకవర్గ కన్వీనర్ డిమాండ్ చేశారు.