నరసరావుపేట జనసేన ఆధ్వర్యంలో వాలంటీర్స్ కు ఘన సన్మానం..

నరసరావుపేట జనసేన పార్టీ ఆధ్వర్యంలో.. ఇన్చార్జ్ సయ్యద్ జిలాని నాయకత్వంలో.. శుక్రవారం పార్టీ ముఖ్య కార్యకర్తల బీమా పత్రాలు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా రొంపిచర్ల మండలం ముఖ్య కార్యకర్తలకు.. సభ్యత్వం చేయించిన కార్యకర్తలకు మండల అధ్యక్షులు అచ్చుల సాంబశివరావు బీమా పత్రాలు అందజేసి.. సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు జి వి ఎస్ ప్రసాద్. అద్దేపల్లి ఆనందబాబు. బెల్లంకొండ ఈశ్వర్. బెల్లంకొండ అనిల్.వీరవల్లి వంశీ. దుర్గా కుమారి. ఆర్ కే యాదవ్, గుప్త శ్రీకాంత్, అబ్దుల్ రవూఫ్, మిరియాల సోము, వెంకటేశ్వర్లు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.