యూట్యూబ్‌లో సరికొత్త రికార్డ్‌ సృష్టించిన అల్లు అర్జున్‌ సినిమా

అల్లు అర్జున్‌కు స్టైలిష్‌ స్టార్‌ గా ఉన్న క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తెలుగుతో పాటు కేరళలో కూడా బన్నీకి ఫ్యాన్స్ ఎక్కువే. అల్లు అర్జున్‌ సినిమాలకి మలయాళంతో పాటు హిందీ భాషలో కూడా విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. ఈ ఫాలోయింగ్ కు అనుగుణంగా బన్ని సినిమాలు అన్ని కూడా ఈ రెండు భాషలలో డబ్బింగ్ అవుతూ ఉంటాయి. తెలుగులో ఒక మాదిరిగా ఆడిన సినిమాలు కూడా డబ్బింగ్ వెర్షన్‌లో మంచి హిట్ టాక్ తెచ్చుకుంటాయి. ఇక కొన్ని ప్రొడక్షన్ సంస్థలు బన్నీ ప్రతి సినిమాని హిందీలో డబ్బింగ్ చేసి విడుదల చేస్తారు. ఈ క్రమంలో అల్లు అర్జున్ బోయపాటి కాంబినేషన్‌లో వచ్చిన సినిమా ‘సరైనోడు’ హిందీ డబ్బింగ్ వెర్షన్‌ యుట్యూబ్‌లో రికార్డులు క్రియేట్ చేస్తోంది. ఈ సినిమా ఏకంగా మూడు వందల మిలియన్ వ్యూస్ క్రాస్ చేసి దేశంలో అత్యధిక మంది వీక్షించిన సినిమాగా సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. బన్నీ సినిమాకి దరిదాపులలో ఒక్క హిందీ సినిమా కూడా లేకపోవడం గమనిoచవచ్చు. ఈ విషయాన్ని అనలిస్ట్‌ కమల్‌నాథ్‌ ట్విట్టర్‌ ద్వారా తెలియచేసారు.