ప్లాస్టిక్ ను నివారించండి పర్యావరణాన్ని పరిరక్షించండి: పి.జి.గుప్తా

*అంజనీపుత్ర చిరంజీవి వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో గుడ్డ సంచులు పంపిణీ

విజయనగరం: పర్యావరణ పరిరక్షణలో భాగంగా.. అంజనీపుత్ర చిరంజీవి వాకర్స్ క్లబ్ వ్యవస్థాపక అధ్యక్షులు, జనసేన పార్టీ సీనియర్ నాయకులు త్యాడ రామకృష్ణారావు(బాలు)ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం స్థానిక ఆర్&బి జంక్షన్ వద్దనున్న రైతు బజారులో సుమారు మూడువందల మందికి గుడ్డ సంచులను, ముఖ్య అతిధిగా హాజరైన వాకర్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్-102 గవర్నర్, పి.జి. గుప్తా చేతులమీదుగా పంచిపెట్టడం జరిగింది.

ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ.. ప్రపంచంలో ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలంటే ప్రజలంతా ప్లాస్టిక్ ను నివారించి, నిషేధించి, మొక్కలను నాటి పర్యావరణాన్ని పరిరక్షించిననాడే అందరూ ఆరోగ్యంగా ఉంటారని, అందుకే ప్రజలంతా ప్లాస్టిక్ ను నిషేధించి పర్యావరణాన్ని పరిరక్షించాలని పిలుపునిచ్చారు.

అనంతరం గవర్నర్ గుప్తా క్లబ్ సభ్యులు మరియు కొంతమంది ప్రజలచే ప్లాస్టిక్ ను నిషేదిస్తామని ప్రతిజ్ఞ చేయించి, ప్లాస్టిక్ ను అరికడతామని నినాదాలు చేయించారు.

ఈ కార్యక్రమంలో డిస్ట్రిక్ట్-102 క్యాబినెట్ సెక్రటరీ ఎస్. సంజీవరావు, డిప్యుటీ గవర్నర్ సన్యాసి రాజు, స్టార్ వాకర్స్ క్లబ్ అధ్యక్షులు చలపాక సూర్యారావు, బాలాజీ వాకర్స్ క్లబ్ సూర్యనారాయణ, అంజనీపుత్ర చిరంజీవి వాకర్స్ క్లబ్ కార్యదర్శి కొయ్యాన లక్ష్మణ్ యాదవ్, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ డాక్టర్ ఎస్. మురళీమోహన్, చెల్లూరి ముత్యాల నాయుడు తదితరులు పాల్గొన్నారు.